ఉద్యమకారుల ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం.
- కేసులకు అరెస్టులకు భయపడేది లేదు.
- ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తే మరో ఉద్యమం తప్పదు: ఛైర్మన్ కాచం సత్యనారాయణ.
ఎల్బీనగర్:
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఉద్యమకారులకు భూ పోరాటం పిలుపుమేరకు కాచం సత్యనారాయణను చైతన్యపురి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏ పార్టీకి కొమ్ముకాయదని, ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేసే సంఘాల తోటి కలిసి ప్రయాణం చేస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో ఉద్యమకారుల సంఘాలకు పార్టీలతోని పని లేకుండా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలిపారు. అక్రమ ముందస్తు అరెస్టులకు పోలీస్ నిర్బంధాలకు భయపడేది లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో 2001 నుండి 2014 వరకు రాష్ట్ర సాధనలో కీలక భూమిక వహించిన శ్రీకాంత్ చారి త్యాగం వృదా పోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం వారి ఆకాంక్షల కోసం మరో ఉద్యమాన్ని కూడా ఎల్బీనగర్ నే అడ్డాగా చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలము, గుర్తింపు కార్డు, 25000 పెన్షన్ లాంటి హామీలు ఇచ్చిందని ఆ వాగ్దానాల అమలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల నుండి ఉద్యమకారులకు కనీసం 1000 ఎకరాల భూమిని కేటాయించాలని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు తగిన గౌరవం కల్పిస్తూ, ఆగస్టు 1లోపు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయని క్రమంలో ఆగస్టు 6 తారీఖున ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి తామే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ గుప్తా, ఇరుగు శ్రీధర్, కొత్త రవి, కూర రమేష్, , శ్యామ్ సుందర్ నేత, కృష్ణ, శ్రీనివాస్, తేలుకుంట్ల కృష్ణ, శివ, సురేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
