ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ఉల్లంఘన?
- -హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలు
- -నిర్మాణాలపై నీటిపారుదల శాఖ ఫిర్యాదు
రంగంలోకి హైడ్రా:
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ మాఫియా ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ప్రజాపాలన అమలులోకి రాగానే రియల్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగర గుండెకాయగా పేరొందిన హుస్సేన్‌సాగర్ బఫర్, ఎఫ్‌టిఎల్‌లో చేపట్టిన బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాల చిట్టా విప్పుతున్నారు. నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు లేకుండానే నాలాపై 'ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్' చేపట్టిన 20 అంతస్తుల అక్రమ కట్టడాలపై ఎట్టకేలకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. గత పాలకుల అండదండలతో కనీసం...
అనుమతులు లేకుండానే నాలాపై 'ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్' చేపట్టిన 17 అంతస్తుల అక్రమ కట్టడాలపై ఎట్టకేలకు హైద్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం దృష్టిసారించింది. గత పాలకుల అండదండలతో కనీసం రహదారి మార్గం కూడా లేని చోట టౌన్‌ప్లానింగ్ అధికారులు కళ్లు మూసుకుని అనుమతుల వర్షం కురిపించారు. ఈ అడ్డదారి పర్యవసానంతో బ్యాంక లోన్లు, ఫ్రీలాంచింగ్ ఆఫర్ల పేరిట బిల్డర్ సామాన్యుల నడ్డి విరిచి రూ. వందల కోట్లు దండుకున్నాడు. ఇక నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు రుజువైతే కూల్చివేతలు చేపడితే బిల్డర్ సేఫ్ జోన్ లోకి వెళ్లే.. కస్టర్డితాన్ని నమ్మిన కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటి? అక్రమాలకు పచ్చజెండా ఊపి వ్యాపారాల్లో భాగస్వాములైన రాజకీయ నేతలు, లంచగొండి అధికారులను వదిలేసి.. సామాన్యులను బలిపశువులను చేస్తారా? అంటూ ‘భారత శక్తి’ నిలదీస్తోంది.
హైదరాబాద్, జూలై 06 (భారత శక్తి బ్యూరో):
*దారి లేకపోయినా అనుమతులు.. నిబంధనలు బూడిదలో పోసిన పన్నీరేనా?
సదరు నిర్మాణ సంస్థకు కనీసం సైట్‌లోకి వెళ్లేందుకు సరైన రహదారి మార్గం కూడా లేదు. నిబంధనల ప్రకారం రోడ్డు కనెక్టివిటీ లేని స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదు. కానీ, ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే మార్గాన్ని రవాణా దారిగా వాడుకుంటూ దర్జాగా నిర్మాణ పనులు సాగిస్తున్నారు. నీటిపారుదల శాఖ ఎఫ్‌టీఎల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, నాలాపై ఈ 17 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఇరిగేషన్ విభాగం స్పష్టం చేసింది. రికార్డులను పరిశీలించి బాధ్యులపై తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీలకు వచ్చిన అధికారుల బృందం వెల్లడించింది..jpeg)
ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం మరియు పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ రాజకీయ ప్రాబల్యం, అండదండలతోనే 'ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్' జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి సులువుగా అనుమతులు పొందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అనుమతుల ఆధారంగా ప్రైవేట్ బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయల లోన్లు (రుణాలు) పొందడమే కాకుండా, మార్కెట్లో భారీగా ప్రచారం (అడ్వర్టైజ్‌మెంట్) చేస్తూ 'ఫ్రీ లాంచింగ్ ఆఫర్ల' పేరిట సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి కోట్లాది రూపాయల బుకింగ్ అడ్వాన్సులు వసూలు చేసింది.
ఇప్పుడు ఈ 17 అంతస్తుల భవనం అక్రమమైనదని తేలితే, బిల్డర్ చేతులెత్తేయడం ఖాయం. అప్పుడు నష్టపోయేది కేవలం సామాన్య కొనుగోలుదారులే. తమ కష్టార్జితాన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రజలు చివరకు లబోదిబోమంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*రెండేళ్లుగా ఏం చేస్తున్నారు? అధికారులపై చర్యలేవి?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, ఇంతవరకు ఈ అక్రమ ప్రాజెక్టుకు నోటీసులు ఇవ్వకుండా యంత్రాంగం ఎందుకు తాత్సార్యం చేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్తశుద్ధిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం నిర్మాణాలను కూల్చడం లేదా తనిఖీలు చేయడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనా.. అసలు అక్రమాలకు తెరలేపిన అధికారులపై చర్యలు ఎక్కడ? అని బాధితులు నిలదీస్తున్నారు.
*టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలేవి?:కనీసం స్థలాన్ని పరిశీలించకుండా, దారి లేకపోయినా 20 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు?
*సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై విచారణ ఏది?: ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూములకు, వివాదాస్పద నిర్మాణాలకు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
*రెవెన్యూ, ఇరిగేషన్ వైఫల్యం: క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడంలో విఫలమైన స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పాత్రపై విచారణ ఎందుకు జరగడం లేదు?
‘భారత శక్తి’ విశ్లేషణ: బలిపశువు అవుతున్నది సామాన్యుడే!
*ఈ అక్రమ దందాలో భవిష్యత్తులో నిర్మాణం ఆగిపోయినా, కూల్చివేసినా బిల్డర్ ముందస్తుగా పొందిన బ్యాంక్ లోన్లు, ప్రజల సొమ్ముతో సేఫ్ జోన్‌లో ఉంటాడు. కానీ, జీవితకాల కష్టాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కొనుగోలుదారుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతుంది. ప్రభుత్వం, బిల్డర్లు, కోర్టుల చుట్టూ తిరిగే ఈ వివాదంలో చివరికి నష్టపోయేది స్థానిక ప్రజలే. ప్రభుత్వ యంత్రాంగం కేవలం చర్యల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాకుండా, అక్రమ అనుమతులిచ్చిన లంచగొండి అధికారులను జైలుకు పంపి, కొనుగోలుదారులకు పూర్తి న్యాయం జరిగేలా చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
