తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
ఎల్బీనగర్:
తెలంగాణ ప్రాంత జర్నలిస్ట్ ను కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సివిల్ డ్రెస్ లో వచ్చిన వాళ్ళు ఎత్తుకుని పోతుంటే తన భర్తను కాపాడుకోవడానికి అడ్డుకున్న మహిళతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా ఆమె మీదనే తిరిగి కేసులు పెట్టిన ఏపీ పోలీసులు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.తదుపరి విచారణ కోసం కేసును హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కి కేసు బదిలీ. కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు బొబ్బిలి పోలీసులు హైదరాబాద్ రాగా ఈ సందర్భంగా కేవిఆర్ భార్య విజయలక్ష్మి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బొబ్బిలి నుండి అరవెల్లికి బదిలీ అయిన సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.
About The Author
08 Jul 2026
