*జీహెచ్‌ఎంసీలో ‘డీజిల్’ దందా: నిబంధనలు బేఖాతరు.. కోట్లలో కుంభకోణం!
- కమిషనర్ సర్క్యులర్ నం. 4089 గాల్లోకి.. ఫోర్‌మెన్ల చేతుల్లో కూపన్ల ఇష్యూ!
- *జీపీఎస్ డేటాకు, ఇంధన వినియోగానికి పొంతన లేదు
- *కవాడిగూడ టు చార్మినార్.. జోన్లు దాటుతున్న డీజిల్ మతలబులు!
- దొంగ కూపన్లు, అని తెలియపరుస్తూ ఆధారాలు పొందుపరిచి వార్తలు రాసినా శాఖా పరమైన చర్యలు ఎక్కడ..!
- కవాడిగూడ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ను టార్గెట్ చేసుకొని 16 సంవత్సరాల నుండి దిష్ఠ వేసుకుని దోచుకుంటున్న ఫోర్ మెన్ ఫారూఖ్..!
- జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి కర్ణన్ కు చిత్తశుద్ధి ఉంటే ఫోర్ మెన్లను వెంటనే సస్పెండ్ చేయాలి..
- జిహెచ్ఎంసి విజిలెన్స్ సెంట్రల్ విజిలెన్స్ ఏసీబీ, ఈ అవినీతి పై విచారణ జరిపి నిగ్గు తేల్చాలి:
- మున్సిపల్ సెక్రెటరీ జయేష్.రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..!
పాలన గాడితప్పితే లూటీగాళ్లకు పండగే! జీహెచ్‌ఎంసీ ఖజానాను కొల్లగొడుతూ, కమిషనర్ సర్క్యులర్లను గాల్లోకి లేపేస్తూ ‘డీజిల్’ దందా కోట్లలో సాగుతోంది. ఆధారాలున్నా చర్యల్లేని వింత రాజ్యంలో.. ఉన్నతాధికారుల అండతో ఫోర్‌మెన్లు చక్రం తిప్పుతున్నారు. వాహనాలు షెడ్డులో ఉన్నా నకిలీ రిపేర్ బిల్లులు, జీపీఎస్ డేటాకు పొంతనలేని దొంగ కూపన్ల మాయాజాలం నడుస్తోంది. ఈ దోపిడీపై ఏసీబీ విచారణ జరిపి, అవినీతి తిమింగలాలకు సంకెళ్లు వేయాల్సిందే!
"ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం"
హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రవాణా విభాగంలో అక్రమాల పుట్ట బద్దలైంది. ఉన్నతాధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతూ, నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న భారీ డీజిల్ కుంభకోణం వెలుగుచూసింది. కవాడిగూడ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్ వేదికగా సాగుతున్న ఈ అక్రమ లీలలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు అందినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
*జోన్లు దాటిన ‘కూపన్ల’ మతలబు!
నిబంధనల ప్రకారం ఏ జోన్‌కు సంబంధించిన వ్యయ ప్రయోజనాలు ఆ జోన్ పరిధికే పరిమితం కావాలి. కానీ, సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కవాడిగూడ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఫోర్‌మెన్ ఫారుక్, చార్మినార్ జోన్ పరిధిలోని మలక్పేట్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్ వాహనాలకు (బొలెరో తదితర వాహనాలకు) డీజిల్ కూపన్లు జారీ చేయడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్ళింపు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతర్గత పరిశోధనల ప్రకారం.. ఇలా జారీ అవుతున్న కూపన్లలో దాదాపు 50 శాతం కూపన్లను ప్రైవేటు బంకుల్లో నగదుగా మార్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మున్సిపల్ వాహనాలకు ఇంధనాన్ని కేటాయించే ప్రక్రియలో పారదర్శకత కోసం మున్సిపల్ కమిషనర్ స్పష్టమైన సర్క్యులర్ (నెం. 4089/GHMC/HDN/2025) జారీ చేశారు. దీని ప్రకారం కేవలం అసిస్టెంట్ ఇంజనీర్లు (AE), డివిజనల్ ఇంజనీర్లు (DE) లాంటి ఉన్నతాధికారులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా డీజిల్ కూపన్లను పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేని కొందరు ఫోర్‌మెన్లు, తామే ఉన్నతాధికారులుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా కూపన్లు జారీ చేస్తూ ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు.
*16 సంవత్సరాల నుండి మరమ్మత్తుల పేరిట ‘మాయాజాలం’.. నెలకు రూ. 35 లక్షలు!
కవాడిగూడ వర్క్‌షాప్‌లో వాహనాలు సుస్థితిలో ఉన్నా, లేదా షెడ్డులోనే మూలన పడి ఉన్నా.. వాటికి నిరంతరం మరమ్మత్తులు జరుగుతున్నట్లు నకిలీ బిల్లులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా సుమారు మేజర్ మైనర్ నుండి రూ. 35 లక్షల మేర తప్పుడు రిపేర్ బిల్లులను తయారు చేసి నిధులను దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ వాహనాల కదలికలను పర్యవేక్షించేందుకు లాగ్‌బుక్‌లతో పాటు జీపీఎస్ (GPS) ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో వాహనం తిరిగిన కిలోమీటర్లకు మరియు వినియోగించినట్లు చూపుతున్న ఇంధనానికి అస్సలు పొంతన కుదరడం లేదు. కేవలం కాగితాల్లోనే వాహనాలు తిరిగినట్లు చూపిస్తూ, డీజిల్ కూపన్లను పక్కదారి పట్టిస్తున్న వైనం స్పష్టమవుతోంది.
*‘ఏసీబీ’ విచారణ చేపట్టాలి: ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ డిమాండ్
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ భారీ కుంభకోణంపై ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ తీవ్రంగా స్పందించింది.
* ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ప్రత్యేక *ఫోరెన్సిక్ ఆడిట్* నిర్వహించాలి.
* లభ్యమైన పూర్తి ఆధారాలను స్టేట్ విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ (*ACB*)కు అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలి.
* నకిలీ కూపన్లు, తప్పుడు బిల్లులు సృష్టించిన సిబ్బందిపై, వారికి సహకరించిన ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కమిషనర్ ఆదేశాలనే లెక్కచేయని సదరు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు నగరంలో వెల్లువెత్తుతున్నాయి.
*ఈ అవినీతిలో మాకు భాగం ఉంటుంది అంటున్నా: కవాడిగూడ డిప్యూటీ ఇంజనీర్ వినయ్ భూషణ్:
జిహెచ్ఎంసి కమిషనర్ సర్కులర్ నంబర్ 4089/2025 ను ధిక్కరిస్తూ కవాడిగూడ డిప్యూటీ ఇంజనీర్ వినయ్ భూషణ్ ఫోర్ మెన్ ఫారుక్ కు మేమే అప్రూవల్ ఇచ్చామని చెప్పడం ఫోర్ మెన్ ఫరూక్ అవినీతిలో డి.ఈ వినయ్ భూషణ్ పాత్ర ఎంత ఉందో నీగావిభాగాలు దృష్టి సారించాలి..
అలాంటప్పుడు కమిషనర్ ఆర్డర్ ఎందుకు..? డిప్యూటీ ఇంజనీర్ అవినీతి ఫోర్ మెన్ కు సపోర్ట్ ఎందుకు..?
రూల్స్ అన్ని అవినీతికి అదునుగా మార్చుకుంటూ అవినీతేపరమావధిగా జిహెచ్ఎంసి ఖజానాను కొల్లగొట్టి కోట్లు లూటీ చేసి విలాస జీవనంలో తులతూవుతూ ప్రభుత్వ రూల్స్ ని రాజ్యాంగాన్ని హేళన చేస్తూ నవ్వడం అవినీతిపరులకు పరిపాటిగా మారిపోయింది.. ఈ విషయంపై జిహెచ్ఎంసి విజిలెన్స్, ఏసీబీ నిఘా విభాగాలు దృష్టిస్తారించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు.
2007,2008 సంవత్సరంలో 27 కోట్ల ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ స్కామ్ జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సీసీఎస్ కు ఫార్వర్డ్ చేసిన ఎఫ్ ఆర్ నెంబర్ 127/2016.. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు ఈ ఫోర్ మెన్ ఏ విధంగా తప్పించుకున్నాడు అనే కథనంతో రేపటి కథనంలో...jpeg)
.jpeg)

