నేను సైతం 2.0 కార్యక్రమం
నేను సైతం 2.0 కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రియదర్శిని పార్క్ లో 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య.ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ, సీసీ కెమెరాల నిఘా ప్రాముఖ్యత, నేరాల నివారణ, నియంత్రణ, ప్రజా భద్రత జరిగే నేరాలను గుర్తించడంలో, దర్యాప్తు చేయడంలో పోలీసులకు సహాయపడడంలో సీసీ కెమెరాల పాత్ర గురించి, కమ్యూనిటీ పోలీసింగ్, బలోపేతానికి ఈ ప్రాంత భద్రతను మెరుగుపరచడానికి, తమ నివాసాలు, వాణిజ్య సంస్థలు, కీలక ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేను సైతం 2.0 కార్యక్రమాన్ని వివరించారు. ఈ సమావేశంలో సరూర్నగర్ సీఐ శ్రీశైలం, ఎస్ఐలు లక్ష్మణ్, శ్రవణ్ పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పార్క్ సందర్శకులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
08 Jul 2026
