ప్రజాధనం స్వాహా: డీజిల్ మాఫియా గుట్టురట్టు!

  • *వాహనాలు తిరగలేదు... మైలేజీ పెరగలేదు... కానీ వందల లీటర్ల ఇంధనం మాయం!
  • వాహనాలు నడవకపోయినా బిల్లులు మంజూరు ఎలా సాధ్యం..!
  • *మూడేళ్ల రికార్డులపై విజిలెన్స్ నజర్.. ఫోరెన్సిక్ ఆడిట్‌కు డిమాండ్.. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక సంస్థ!
  • *డి.ఈ వినయ్ భూషణ్, ఫోర్ మెన్ ఫారూఖ్ అవినీతిలో ప్రధాన సూత్రధారులే..!
  • కవాడిగూడ నుండి చార్మినార్ కు దొంగ డీజిల్ కూపన్లు ఇష్యూ చేస్తున్న ఫోర్ మెన్ ఫారుక్ పై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ.కర్ణన్ చర్యలు ఎక్కడ..!
  • వాహనం ఎంట్రీ క్లోసింగ్ లాక్ షీట్, జోహార్ నగర్ డంపింగ్ యార్డ్, తనిఖీలు నిర్వహిస్తే అవినీతి బట్టబయలు, 
  • జిహెచ్ఎంసి విజిలెన్స్ ఏసీబీ నిఘా విభాగాలు అవినీతిపరుల ఆట కట్టించాలి..!
  • జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మున్సిపల్ సెక్రెటరీ జయష్ రంజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి,

ప్రజాధనం స్వాహా: డీజిల్ మాఫియా గుట్టురట్టు!

ప్రభుత్వ విభాగాల్లో ప్రజాధనమే లక్ష్యంగా సాగుతున్న డీజిల్ మాఫియా బాగోతాన్ని 'భారత శక్తి' పత్రిక బట్టబయలు చేసింది. ఐదు సర్కిళ్ల పరిధిలో వాహనాలు రోడ్డెక్కకపోయినా, మైలేజీ పెరగకపోయినా కాగితాల్లో మాత్రం వందల లీటర్ల ఇంధనాన్ని మాయం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, లాగ్‌బుక్‌ల మధ్య భారీ వ్యత్యాసాలు కుంభకోణ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.  25టర్నర్ 8  వాహనాలకు రోజుకు మూడు ట్రిప్పులు తిరుగుతే 840 లీటర్ల అవసరముంటే..! ఏకంగా 1200 లీటర్ల క్లెయిములు సృష్టించారు. ఈ ఇంధన దోపిడీపై జి.పి.ఎస్ డేటా, ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా లోతైన విచారణ జరిపి, అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

(ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..)

 
*హైదరాబాద్:

ప్రజాధనానికి గండి కొడుతూ, ప్రభుత్వ ఇంధన కోటాను అడ్డగోలుగా కాజేస్తున్న డీజిల్ మాఫియా బాగోతం బట్టబయలైంది. వాహనాలు రోడ్డెక్కిన దాఖలాలు లేవు, కానీ కాగితాల్లో మాత్రం వందల లీటర్ల డీజిల్ ఖర్చయిపోయినట్లు రికార్డులు సృష్టించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు, కార్యాలయాల్లోని ఫైళ్లకు అస్సలు పొంతన లేకపోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని "అవినీతి నిరోధక మరియు మానవ హక్కుల వేదిక" (ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు అధికారిక వినతిపత్రం సమర్పించింది.WhatsApp Image 2026-07-05 at 20.43.41

*కాగితాల్లోనే వాహనాల పరుగు –  25 టర్నర్ పేరిట భారీ దోపిడీ!

విచారణలో తేలిన ప్రాథమిక అంశాల ప్రకారం..  25 టర్నర్,   8వాహనాలు, ఒక్కో వాహనానికి జోహార్ నగర్ డంపింగ్ యార్డ్ పోవడానికి సుమారు 35 లీటర్ల డీజిల్ సరిపోతుంది. మొత్తం అవసరం 840 లీటర్లలోపే ఉన్నప్పటికీ, ఏకంగా '1200 లీటర్లకు' ఇంధన క్లెయిములు సమర్పించినట్లు ఆరోపణలు, ఒక్కోరోజు అసలు వాహనాలు నడవవు రిపేర్ లో ఉంటాయి ఇంకా డిజిల్ కేటాయింపులు తగ్గాలి. అంటే భారీ డీజిల్ సౌర్యం జరిగిందని వ్యక్తం అవుతుంది, అసలు అంత పెద్ద మొత్తంలో డీజిల్ ఎటు పోయింది? ఎవరి జేబుల్లోకి చేరింది? అనే కోణంలో తక్షణ విచారణ ప్రారంభం కావాల్సి ఉంది.

*ఐదు సర్కిళ్ల పరిధిలో నెలకు వేల లీటర్ల మాయం?
మలక్‌పేట్, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా సర్కిళ్ల పరిధిలో ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం.
 * ఈ ఐదు సర్కిళ్లలో మొత్తం 23 వాహనాలకు రోజుకు 750 లీటర్ల డీజిల్ మంజూరు అవుతోంది.
 * గత మూడేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఈ అక్రమాల అసలు పరిమాణం బయటపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 *వాహనాల వాస్తవ వినియోగం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జి.పి.ఎస్) ట్రాకింగ్ డేటా, ప్రయాణ వివరాల పత్రాలు (ట్రిప్ షీట్లు), లాగ్‌బుక్‌లు మరియు డీజిల్ బిల్లులను ఒకదానితో ఒకటి సరిపోల్చితే ఈ డీజిల్ దొంగల ముఠా గుట్టు పూర్తిగా రట్టవుతుంది.

*రంగంలోకి విజిలెన్స్: ఆ రికార్డులన్నీ స్వాధీనం!
ఈ భారీ ఇంధన దోపిడీపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపేందుకు 2023 నుండి ఇప్పటి వరకు ఉన్న కీలక రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ ఊపందుకుంది. ప్రధానంగా కింది విభాగాల రికార్డులపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి:
 1.ఇంధన మరియు క్లెయిమ్ రికార్డులు: డీజిల్ మంజూరు పత్రాలు, కూపన్ రిజిస్టర్లు, డీజిల్ బంక్ బిల్లులు, రశీదులు మరియు క్లెయిమ్ ఫైళ్లు.
 2.వాహన గమన రికార్డులు: వాహనాల జి.పి.ఎస్ సమాచారం, వెహికల్ లాగ్ బుక్స్, ప్రయాణ వివరాల పత్రాలు, ఐంబెల్ (IMBEL)/ఐబిటి (IBT) రికార్డులు.
 3.డంపింగ్ యార్డ్ తనిఖీలు: జవహర్‌నగర్ వ్యర్థాల శుద్ధి కేంద్రం (డంపింగ్ యార్డ్) పరిధిలోని సిసి కెమెరా ఫుటేజ్, రాకపోకల రిజిస్టర్లు, వే బ్రిడ్జ్ రికార్డులు మరియు బరువు రశీదులు.
 4.కార్యాలయ రికార్డులు: సిబ్బంది హాజరు పట్టికలు, ఇ-ఆఫీస్ ఫైళ్లు మరియు ఇంధన ఆమోద పత్రాలు.WhatsApp Image 2026-07-05 at 20.43.42 (2)

*అధికారుల పాత్రపై లోతైన విచారణ: నిందితుల జాబితా ఇదే!
2024 సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు నివేదికలతో డీజిల్ మంజూరును ఆమోదించిన అధికారుల పాత్రపై లోతైన విచారణ జరగాలని వినతిపత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇంధన సాంక్షన్, కూపన్ల పంపిణీ, బిల్లుల ఆమోదం మరియు ధృవీకరణ ప్రక్రియలో కుమ్మక్కైన కింది సిబ్బందిపై విచారణ ముమ్మరం కానుంది:
 *జోనల్ కమిషనర్
 *సి.టి.ఓ (CTO) మరియు డి.సి.టి.ఓ (DCTO)
 *ఎగ్జామినర్
 *సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు (AEs)
 *కేర్‌టేకర్లు
 *ఫోర్‌మన్ ఫరూఖ్ అలీ మరియు ఇతర ఫోర్‌మెన్లు

*విజిలెన్స్ ఆదేశం:
విచారణలో అక్రమాలు, అధికార దుర్వినియోగం లేదా ప్రభుత్వ ధనానికి నష్టం చేకూర్చినట్లు తేలితే, సదరు అధికారులపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

*ఫోరెన్సిక్ ఆడిట్‌కు డిమాండ్
ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఒక స్వతంత్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని, రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అవినీతి నిరోధక మరియు మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. వాస్తవ వినియోగానికి, కాగితాల్లో చూపిన వినియోగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లెక్కగట్టి, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని పౌర సమాజం కోరుతోంది. ప్రజాధనాన్ని లూటీ చేసిన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారీ అవినీతికి పాల్పడిన ఫోర్ మెన్ ఫారుక్ పై జిహెచ్ఎంసి కమిషనర్ కు ప్రేమ ఎందుకు..? చిత్తశుద్ధి ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలి.. 

మరిన్ని ఆధారాలతో రేపటి కథనంలో...!WhatsApp Image 2026-07-05 at 20.42.08 (1)WhatsApp Image 2026-07-05 at 20.42.08

About The Author