నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించండి...
పోలియోపై విజయం సాధించండి:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి.
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయిదు సంవత్సరాలలోపు పసి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణాపురం (ఐటీడీఈఎస్ కోపరేటివ్ సొసైటీ) కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అల్కాపురి కాలనీ సంక్షేమ సంఘం భవనం, ఎన్టీఆర్ నగర్ 50 యార్డ్స్ లోని అంగన్వాడీ కేంద్రాలల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పసిపిల్లల తల్లిదండ్రులకు పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అయిదు ఏండ్ల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయిద్దాం..! చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..!! అని పిలుపునిచ్చారు. బిడ్డ అంగ వైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం పోలియో చుక్కలే అన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు 0-5 ఏళ్ల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్ధాం అన్నారు.
