స్వయం ధృవీకరణ ముసుగులో అక్రమ నిర్మాణాల దందా

  • ఎం.ఎం.సి ఎల్బీనగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ 14 లో నిబంధనలకు పాతర. 
  • *రెండు అంతస్తుల రెసిడెన్షియల్ అనుమతితో నాలుగు అంతస్తుల కమర్షియల్ నిర్మాణం.. 
  • అగ్నిమాపక భద్రత శూన్యం.. చుట్టుపక్కల నివాసితుల ప్రాణాలకు తీవ్ర ముప్పు.. 
  • రాతపూర్వక ఫిర్యాదులు బుట్ట దాఖలు..

స్వయం ధృవీకరణ ముసుగులో అక్రమ నిర్మాణాల దందా

హయాత్‌నగర్ :
 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వయం ధృవీకరణ విధానాన్ని కొందరు రియల్టర్లు, ఆస్తి యజమానులు తమ స్వార్థానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుంటామని దరఖాస్తు చేసుకుని, క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి భయమూ లేకుండా అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్ సర్కిల్ పరిధిలో వెలుగుచూసిన ఈ భారీ నిబంధనల ఉల్లంఘన స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

*అనుమతి ఒకటికి.. నిర్మాణం మరొకటికి!
 సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని ప్లాట్ నెం. 34 (పశ్చిమ భాగం), ప్లాట్ నెం. 35 (తూర్పు భాగం) పరిధిలో గల 127.92 చదరపు మీటర్ల స్థలంలో భవన నిర్మాణానికి యజమాని కె. అనిత (భర్త కె. సురేష్) మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతి పొందారు. మున్సిపల్ చట్టం మరియు స్వయం ధృవీకరణ పద్ధతి కింద కేవలం వాహనాల నిలుపుదల స్థలం (స్టిల్ట్ పార్కింగ్) మరియు రెండు పై అంతస్తుల నివాస భవన నిర్మాణానికి మాత్రమే తాత్కాలిక అనుమతి లభించింది.
కానీ, అధికారికంగా మంజూరైన ప్రణాళికను సదరు ఆస్తి యజమాని పూర్తిగా పక్కనబెట్టారు. ఎలాంటి అదనపు అనుమతులు లేదా చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా, మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా ఏకంగా మరో రెండు అదనపు అంతస్తులను అక్రమంగా నిర్మించారు. అంటే రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని, ఏకంగా నాలుగు అంతస్తుల భారీ భవనాన్ని నిలబెట్టారు.

అధికారిక ఆధారాలు మరియు భవన నిర్మాణ అనుమతి వివరాలు:
 
భవన అనుమతి ఫైల్ నెంబర్: 051208/MMC/02183/IABP/C14/2026

 భవన అనుమతి నెంబర్: 1955/MMC/IA/C14/2026
 *అనుమతి జారీ చేసిన తేదీ: 17/04/2026
 *ఆస్తి చిరునామా: ఇంటి నెం. 5-6-34/2, సర్వే నెం: 201 (పాక్షికం), కొత్తది 201/3, సాహెబ్‌నగర్ కలాన్, హయాత్‌నగర్ సర్కిల్ 14, ఎల్.బి. నగర్ జోన్, రంగారెడ్డి జిల్లా.

*ప్రమాదంలో పొరుగువారి ప్రాణాలు - అగ్నిమాపక భద్రత శూన్యం
 ఈ అనధికార నిర్మాణం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, చుట్టుపక్కల నివాసితుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవన నిర్మాణ సమయాల్లో వదలాల్సిన కనీస ఖాళీ స్థలాన్ని (సెట్‌బ్యాక్స్) ఇక్కడ అస్సలు వదల్లేదు. దీనికి తోడు, ప్రామాణిక అగ్నిమాపక భద్రత నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ చట్టాలను దుర్వినియోగం చేస్తూ నిర్మించిన ఈ అక్రమ కట్టడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యూహాలు వ్యక్తమవుతున్నాయి.

*కమిషనర్ కార్యాలయంలో అధికారిక ఫిర్యాదు - తక్షణ చర్యలకు డిమాండ్
 ఈ అక్రమ కట్టడంపై హయాత్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో (సర్కిల్ నెం-14) 03/06/2026 న అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదును ఎల్.బి. నగర్ జోన్ జోనల్ కమిషనర్ మరియు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు కూడా సమర్పించారు. నిబంధనలను తుంగలో తొక్కిన సదరు యజమానిపై కింది చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు గట్టిగా కోరుతున్నారు:
 1. మున్సిపల్ అధికారులు వెంటనే నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి భౌతిక ధృవీకరణ చేయాలి.
 2. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడానికి వెంటనే **'పని నిలిపివేత ఉత్తర్వులు'  జారీ చేయాలి.
 3. చట్ట పరిరక్షణ కోసం మరియు ప్రజల భద్రత దృష్ట్యా ఈ అనధికారిక అదనపు అంతస్తులను వెంటనే కూల్చివేసి , బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలి.
నగరంలో ఇలాంటి అక్రమ కట్టడాల పట్ల మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, స్వయం ధృవీకరణ విధానాన్ని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ అక్రమ దందాకు ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి.WhatsApp Image 2026-06-29 at 19.38.50

About The Author