‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌ (New Zealand)లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. ఈ మూవీ షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుందని.. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నామని.. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని తాజాగా మంచు విష్ణు ఓ పిక్ పోస్ట్ చేసి వెల్లడించారు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ (The Lord of the Rings) వంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు.. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు ‘కన్నప్ప’ టీం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. జిలాండ్ అనేది పర్ఫెక్ట్ లొకేషన్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, కన్నప్పలోని ఎమోషన్‌ను న్యూజిలాండ్‌లోని లొకేషన్లు ఇంకా ఎలివేట్ చేస్తాయి అని మంచు విష్ణు తెలిపారు. ఈ మూవీని శ్రీకాళహస్తి గుడిలో ప్రారంభించారు. అక్కడే కన్నప్ప తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు సిద్ధపడతారు. న్యూజిలాండ్‌లోని ప్రకృతి దృశ్యాలను, అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ కన్నప్ప సినిమాతో ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే దృశ్యకావ్యంగా రూపొందించాలని మంచు విష్ణు భావిస్తున్నారు. (Vishnu Manchu About Kannappa) న్యూజిలాండ్‌లో ప్రారంభించిన ఈ మూవీని అత్యుత్తమ రీతిలో చిత్రీకరించేందుకు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నాం. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నటీనటులు, అత్యాధునిక సాంకేతికతతో, రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా ఈ కన్నప్పను తెరకెక్కిస్తున్నామని’ మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ (Star Casting) ఈ సినిమాలో భాగం కానుంది. మోహన్‌లాల్ (Mohanlal), శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar), ప్రభాస్ (Prabhas), శరత్ కుమార్ (Sarathkumar) వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌ (New Zealand)లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. ఈ మూవీ షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుందని.. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నామని.. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని తాజాగా మంచు విష్ణు ఓ పిక్ పోస్ట్ చేసి వెల్లడించారు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ (The Lord of the Rings) వంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు.. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు ‘కన్నప్ప’ టీం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

జిలాండ్ అనేది పర్ఫెక్ట్ లొకేషన్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, కన్నప్పలోని ఎమోషన్‌ను న్యూజిలాండ్‌లోని లొకేషన్లు ఇంకా ఎలివేట్ చేస్తాయి అని మంచు విష్ణు తెలిపారు. ఈ మూవీని శ్రీకాళహస్తి గుడిలో ప్రారంభించారు. అక్కడే కన్నప్ప తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు సిద్ధపడతారు. న్యూజిలాండ్‌లోని ప్రకృతి దృశ్యాలను, అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ కన్నప్ప సినిమాతో ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే దృశ్యకావ్యంగా రూపొందించాలని మంచు విష్ణు భావిస్తున్నారు. (Vishnu Manchu About Kannappa)

న్యూజిలాండ్‌లో ప్రారంభించిన ఈ మూవీని అత్యుత్తమ రీతిలో చిత్రీకరించేందుకు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నాం. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నటీనటులు, అత్యాధునిక సాంకేతికతతో, రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా ఈ కన్నప్పను తెరకెక్కిస్తున్నామని’ మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ (Star Casting) ఈ సినిమాలో భాగం కానుంది. మోహన్‌లాల్ (Mohanlal), శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar), ప్రభాస్ (Prabhas), శరత్ కుమార్ (Sarathkumar) వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

About The Author

Related Posts