పేదవారి సొంతింటి కలను సాకారం చేయడమే బీబీఆర్ కన్స్ట్రాక్షన్ ధ్యేయం
* బొల్లిపల్లి తిరుపతి రెడ్డి
తూప్రాన్:
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన "బీబీఆర్ (BBR) కన్స్ట్రాక్షన్ మరియు ఇంటీరియర్" కార్యాలయాన్ని గురువారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీబీఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ ప్రొప్రైటర్ బొల్లిపల్లి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సామాన్యులు మరియు పేదవారి సొంతింటి కలను తక్కువ ఖర్చుతో, నాణ్యమైన ప్రమాణాలతో సాకారం చేయడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక ఇంటీరియర్ డిజైన్లతో భవన నిర్మాణ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తామని ఆయన పేర్కొన్నారు. తమపై నమ్మకంతో వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా తక్కువ ధరలో నాణ్యమైన కట్టడంతో కూడుకున్న ఇల్లును నిర్మించుకోవాలనేవారు తమ బీబీఆర్ కన్స్ట్రక్షన్ ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నేతలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు..jpeg)
