గజ్వేల్ లో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అంబలి పంపిణీ
గజ్వేల్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం గజ్వేల్ ప్రభుత్వ పాఠశాలలో 1983 - 84 సంవత్సరంలో చదువుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు తోట బిక్షపతి, దూబకుంట లక్ష్మణ్, గందే రమేష్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని 1983 - 84 లో పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులం అందరం కలిసి గత మూడు సంవత్సరాల క్రితం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అందులో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం వేసవికాలంలో మజ్జిగ, అంబలి, పులిహోర ఇలా వివిధ కార్యక్రమాల నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు అంబలి పంపిణీ చేయడం జరిగిందని, అంబలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎన్ సీ శ్రీనివాస్, గంగిశెట్టి సుధాకర్, ఓబుల్, జగ్గయ్యగారి శ్రీనివాస్, గుంటుకు యాదగిరి, గౌరీశెట్టి శ్రీనివాస్, ఉప్పల వెంకటయ్య, దేశపతి శంకర్ శర్మ, దూలం వెంకటయ్య, భ్రమరాంబ, రత్నమాల, కృష్ణవేణి, శోభ, శ్రీకాంత్ రెడ్డి, దీనబంధు, వెంకట్ రెడ్డి, హరినాథ్, ధర్మారెడ్డిపల్లి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, నాగరాజు, నేతి శ్రీనివాస్, వేణుగోపాల్, నర్సింలు, రేణిగుంట శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, చేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాందాస్ గౌడ్, భూషణం, తదితరులు పాల్గొన్నారు..jpeg)
