ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వంగ రాజేశ్వర్ రెడ్డి

  • - వసతులపై ఆరా
  • - త్రాగు నీటి సమస్య పరిష్కారిస్తానని హామీ

ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వంగ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట:

సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను వంగ రాజేశ్వర్ రెడ్డి  సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
రైతులు తాగునీటి కొరతను ప్రస్తావించగా, వెంటనే స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో రైతుల్లో కొంత ఊరట కనిపిస్తోందని ఆయన అన్నారు. రైతుల పక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని వంగ రాజేశ్వర్ రెడ్డి  స్పష్టం చేశారు.

About The Author