జోనల్ కమీషనర్ గా వికాస్ మహాతో బాధ్యతల స్వీకరణ

జోనల్ కమీషనర్ గా వికాస్ మహాతో బాధ్యతల స్వీకరణ

ఎల్బీనగర్:

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోనల్ నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారి వికాస్ మహతో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ జోనల్ కమిషనర్ గా పనిచేసిన హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వికాస్ మహతోను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేశారు. సోమవారం ఆయన జెడ్సీగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జోనల్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

About The Author