ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

హర్షం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

గజ్వేల్:

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలాగే 11 శాతం పీఆర్సీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  చిత్ర పటాలకు ఆర్టీసీ కార్మికులతో కలిసి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి  పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పార్టీ అని ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలు నెరవేరుస్తూ వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, గుంటుకు శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2026-04-28 at 19.24.55

About The Author