అన్నయ్య ఆచూకీ కోసం చెల్లెలు ఫిర్యాదు

అన్నయ్య ఆచూకీ కోసం చెల్లెలు ఫిర్యాదు

ఎల్బీనగర్:

గత డిసెంబర్ 2024లో ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన అన్న ఆచూకీ కోసం ఒక చెల్లెలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగోజిగూడలో నివసించే సోదే విష్ణువర్ధన్ అనే వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేస్తూ, తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 18 నెలల క్రితం కన్నతల్లితో గొడవపడి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడని అతని చెల్లెలు ప్రసన్న కుమారి ఫిర్యాదు చేసిందని, పోయిన ఏడాది తన తల్లి చనిపోయిన విషయం అతనికి తెలియజేయడానికి, ఆయన స్నేహితులు ఆయన ఆఫీసులో కూడా విచారణ చేస్తే ఎలాంటి వివరాలు దొరకలేదని, ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీశైలం తెలిపారు.

About The Author