పదో తరగతి ఫలితాల్లో కొండాపూర్ స్కూల్ విద్యార్థుల జైత్రయాత్ర

విద్యార్థులను అభినందించిన గ్రామ సర్పంచ్ జిగిరి అమర్, పాఠశాల యాజమాన్యం


పదో తరగతి ఫలితాల్లో కొండాపూర్ స్కూల్ విద్యార్థుల జైత్రయాత్ర

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. ఎం. వర్ష 579 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, డి. శ్రావణి 555, లహరి 549, వి. అక్షిత 537, ఎ. అలేఖ్య 536, యు. సృజన్ 535, ఎం. దివ్య 534, మరియం ఇమామ్ 523, ఎస్. నోహా, ఎం. మణిశర్మ 511, ఆర్. సాయిలోకేష్, కె. లక్ష్మణ్ 502 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంత మంచి ఫలితాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.ఈ విజయాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందిస్తూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ జిగిరి అమర్  పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

About The Author