బంగ్లా వెంకటాపూర్ లో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
- - వైభవంగా పెద్దమ్మతల్లి కళ్యాణ మహోత్సవం
- - కన్నుల పండుగగా ధ్వజస్తంభం ఏర్పాటు
గజ్వేల్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు, బుధవారం ధ్వజ స్థంభo ఏర్పాటు చేశారు, అమ్మవారి కళ్యాణం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు, ఈ సందర్భంగా, ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, పెద్దమ్మతల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, గత కొన్ని సంవత్సరాల క్రితం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం ధ్వజస్తంభం ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పురోహితులు, ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు, బంగ్లా వెంకటా పూర్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.jpeg)
