లెనిన్ నగర్‌లో తీరిన డ్రైనేజీ కష్టాలు

లెనిన్ నగర్‌లో తీరిన డ్రైనేజీ కష్టాలు

బడంగ్పేట్:

గత దశాబ్ద కాలంగా డ్రైనేజీ సమస్యలతో సతమతమవుతున్న లెనిన్ నగర్ వాసులకు ఊరట లభించింది. కట్టమైసమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీ అవుట్‌లెట్‌కు మంచినీటి పైపులైన్ అడ్డుగా ఉండటంతో ఇన్నాళ్లూ మురుగునీరు సాఫీగా వెళ్లక రోడ్లపైకి చేరేది. దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
ఈ సమస్యను గుర్తించిన టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు *సామిడి గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే **కేఎల్ఆర్* సహకారంతో అధికారులతో మాట్లాడి అత్యవసర పనుల కింద నిధులు మంజూరు చేయించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న ఈ డ్రైనేజీ పునర్నిర్మాణ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి.
*త్వరలో పూర్తిస్థాయి పరిష్కారం:*
పనుల పురోగతిని పరిశీలించిన సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన అడ్డంకిగా ఉన్న పైపులైన్ సమస్యను తొలగించామని, మరో 20 రోజుల్లో మిగిలిన పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం మురుగునీరు సాఫీగా వెళ్తుండటంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*పాల్గొన్న నాయకులు:*
ఈ కార్యక్రమంలో జెటవత్ రవి నాయక్, ధరవాత్ స్వామి నాయక్, మాదరి శ్రీనివాస్, నక్క బాలకృష్ణ, వరికుప్పల శివ, గట్టు వీరన్న, పన్నాల సురేష్, గడియంల కృష్ణ, ఆలేటి నాని తదితరులు పాల్గొన్నారు.

About The Author