రైతు సంక్షేమమే బీజేపీ ధ్యేయం

నాచారం గ్రామ సర్పంచ్ సారిక యాదగిరి

రైతు సంక్షేమమే బీజేపీ ధ్యేయం

గజ్వెల్:

రైతు సంక్షేమమే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, వ్యవసాయ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని నాచారం గ్రామ సర్పంచ్ సారిక  యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో ఐకేపి (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే అమ్ముకోవాలని, కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చే ముందు రైతులు నిర్దేశించిన తేమ శాతం ఉండేలా జాగ్రత్త వహించాలని,  కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ బాగామొల్ల విజయ-మోహన్ హాజరయ్యారు.కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పైన వెంకటేష్, ఏఈఓ భారతి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

About The Author