అశోక్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మధుయాష్కీ, మల్రెడ్డి. రామ్ రెడ్డి,
ఆనంద్ గౌడ్ మృతిపై సంతాపం.. ధైర్యంగా ఉండాలని సూచన*
అబ్దుల్లాపూర్ మెట్:
మాజీ సర్పంచ్ బొడిగె అశోక్ గౌడ్ కుమారుడు ఆనంద్ గౌడ్ ఇటీవల మరణించడంతో.. ఆయన కుటుంబాన్ని టీ.పీ.సీ.సీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి శుక్రవారం పరామర్శించారు.
అబ్దుల్లాపూర్ మెట్ లోని అశోక్ గౌడ్ నివాసానికి వెళ్లిన నేతలు.. ఆనంద్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. చిన్న వయసులో కొడుకును కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ కష్ట సమయంలో అశోక్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
25 Apr 2026
