పెట్రోల్ కొరత... పోలీసుల పహారా
- మూత పడుతున్న పెట్రోల్ బంకులు...వాహనదారులకు తప్పని తిప్పలు
- నో ఫోన్ పే..గూగుల్ పే.. ఓన్లీ క్యాష్..
ఎల్బీనగర్:
పెట్రోల్ డీజిల్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా రెండు రోజుల నుండి ఎల్బీనగర్ ప్రాంతంలో బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.సరూర్నగర్, కొత్తపేట, వనస్థలిపురం, హయత్ నగర్, బి.ఎన్.రెడ్డి నగర్, మన్సురాబాద్ డివిజన్లోని కొన్ని బంకులలో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో బంకులను మూసివేస్తున్నారు. కొద్దిపాటి స్టాక్ ఉన్న బంకులలో వాహనదారులతో గొడవలు పడలేక, స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటున్నారు. చాలా బంకులలో వాహనదారులు ఫోన్ పే, గూగుల్ పే ఆన్లైన్ డబ్బులు తీసుకోకుండా, రొక్కం డబ్బులు మాత్రమే చెల్లించాలని బంక్ నిర్వాహకులు కండిషన్ పెడుతున్నారు..
About The Author
29 Apr 2026
