జిఎన్ఆర్ చైతన్య కో స్కూల్ ఎస్ఎస్సి ఫలితాల్లో విశిష్ట ప్రతిభ
ఎల్బీనగర్:
జిఎన్ఆర్ చైతన్య కో స్కూల్ ఎస్ఎస్సి బోర్డు పరీక్షల్లో మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి, విద్యా రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు గర్వంగా ప్రకటించింది. ఈ సంవత్సరంలో పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమిష్టి కృషికి నిదర్శనం.
టాప్ ర్యాంకర్లు:
ఎస్.సేదిత్యా 579 మార్కులు
ఆర్. నవదీప్ 578 మార్కులు
జి. జయ ప్రకాష్ 576 మార్కులు ఎం. నీతు ప్రణతి 575 మార్కులు జె. విమల్ సాయి 573 మార్కులు కె. హంసిత 571 మార్కులు హెచ్. గాయత్రి 571 మార్కులు గణితంలో 12 మందిలో 6 మంది విద్యార్థులు 100/100 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల సంస్థ వ్యవస్థాపకులు గింజల నరేందర్ రెడ్డి విద్యార్థుల ప్రతిభపై గర్వం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈ అద్భుత విజయానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
