తిమ్మాపూర్ హై స్కూల్‌కు 96.88% ఉత్తీర్ణత
- - వెల్లివిరిసిన విద్యార్థుల ప్రతిభ
- - అభినందించిన హెచ్ఎం. పెంటయ్య
సిద్దిపేట:
తిమ్మాపూర్ హై స్కూల్ పదో తరగతి ఫలితాల్లో 96.88 శాతం ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. పెంటయ్య వివరాలు వెల్లడించారు.మండల రాహుల్ 491 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, జోరబొంతల శరణ్య 473 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. మార్కంటి విశాల్ 453 మార్కులతో మూడో ర్యాంక్ సాధించాడు.మొత్తం 32 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 31 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలతో పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
About The Author
30 Apr 2026
