పదోతరగతిలో సరూర్ నగర్ గురుకుల విద్యార్థుల ప్రతిభ

పదోతరగతిలో సరూర్ నగర్ గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (భారత శక్తి):

పదోతరగతి ఫలితాల్లో సరూర్ నగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. మొత్తం 75 మంది పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాదించారు. డి. నిహారి 573/600, బి. అంజలి 571/600, కె. సోనీ, కె. ప్రేరణ 562/600, జి. భావన 559/600, జె. నిక్షిత 556/600 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులను ప్రిన్సిపల్ కృష్ణప్రభ ఉపాధ్యాయులు అభినందించారు.

About The Author