వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి
గజ్వేల్:
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఐకెపి (IKP) సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, సీసీ కృష్ణ లీల, కార్యదర్శి మమతా, మరియు సులోచన, రాజు, కిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, జాలిగామ రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు
