జాలిగామలో ఉపాధి కూలీలకు రాగిజావా పంపిణీ
గజ్వేల్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఉపశమనం లభించింది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా, ఒకటో వార్డు మెంబర్ చిట్యాల ఎల్లం ఆధ్వర్యంలో బుధవారం కూలీలకు రాగిజావా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి పనుల వద్ద కూలీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ కొమురయ్య, వార్డు మెంబర్ న్యాకం మనోహర్, ఫీల్డ్ అసిస్టెంట్ మాచపురం కృష్ణ, రాజలింగం, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
30 Apr 2026
