జీహెచ్ఎంసీలో అధికారులే ‘డీజిల్’ దొంగలు..!


  • *నడవని బండ్లకు నకిలీ బిల్లులు.. కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా!
  • *విజిలెన్స్ విచారణతో బయటపడ్డ బండారం.. ప్రైవేట్ బంకుల యజమానులు, బడా అధికారుల ‘డీజిల్’ బంధం!
  • కాగితాల్లో ‘ట్రిప్పులు’.. ఖజానాకు ‘చిల్లులు’!
  • జిహెచ్ఎంసి ట్రాన్స్పోర్ట్ ఉన్నతాధికారి అడిషనల్ కమిషనర్ అడ్మిన్ శంకరయ్య అక్రమార్కులకు సపోర్ట్..
  • ట్రాన్స్పోర్ట్  ఫోర్ మెన్ల అక్రమాలపై శాఖపరమైన చర్యలు ఎక్కడ..! 
  • జిహెచ్ఎంసి  కమిషనర్ ఆర్.వి కర్ణన్ , మున్సిపల్ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలంటూ స్థానికుల డిమాండ్..

జీహెచ్ఎంసీలో అధికారులే ‘డీజిల్’  దొంగలు..!

నగసెకసుల చెమట చుక్కల పన్నుల సొమ్ముతో, జీహెచ్ఎంసీ ‘అవినీతి తిమింగలాలు’ డీజిల్ దాహాన్ని తీర్చుకుంటున్నాయి. నగరంలో చెత్త బండ్లు కదలకున్నా.. తెరవెనుక మాత్రం బిల్లుల చక్రాలు ‘జెట్’ స్పీడుతో తిరుగుతున్నాయి! ప్రైవేట్ బంకుల యజమానులు, బడా బాబులు కలిసి కుదుర్చుకున్న ‘డీజిల్ బంధం’ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నైస్‌గా స్వాహా చేసింది.
ఏడాదికి 365 రోజులూ విరామం లేకుండా బండ్లు తిరిగేసినట్లు కాగితాల్లో రికార్డులు సృష్టించి, ఖజానాను ఖాళీ చేసిన సదరు ‘మహాత్ముల’ లీలలు విజిలెన్స్ విచారణతో బట్టబయలయ్యాయి. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, నగర ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ నకిలీ బిల్లుల వీరుల లైసెన్సులు రద్దు చేసి, ఊచలు లెక్కించకపోతే.. వ్యవస్థకు పట్టిన ఈ ‘అవినీతి తుప్పు’ వదిలేదెలా?WhatsApp Image 2026-06-30 at 21.36.36

*హైదరాబాద్:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో పారిశుద్ధ్య వాహనాల నిర్వహణ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పారిశుద్ధ్య వాహనాలు ‘అవినీతి ఇంధనం’తో నడుస్తున్నాయనే నగ్నసత్యం తాజాగా వెలుగుచూసింది. జైల్ గార్డెన్ వర్క్‌షాప్ వేదికగా సాగుతున్న ఈ డీజిల్ దందాపై ‘ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ ముమ్మరమవడంతో అవినీతి తిమింగలాల గుండెల్లో వణుకు మొదలైంది.WhatsApp Image 2026-06-30 at 21.20.39

*నడవని బండ్లు.. ఎగిరిన నిధులు!
గత వారం రోజులుగా (జూన్ 22 నుండి జూన్ 29 వరకు) జైల్ గార్డెన్ వర్క్‌షాప్‌ పరిధిలోని పారిశుద్ధ్య వాహనాలకు డీజిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేట్ పెట్రోల్ బంకులకు ఇవ్వాల్సిన పాత బాకీలు పేరుకుపోవడంతో సదరు యజమానులు చేతులెత్తేయడమే దీనికి కారణం. ఫలితంగా వందలాది పారిశుద్ధ్య వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. నగరంలో చెత్త పేరుకుపోయింది.
కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! క్షేత్రస్థాయిలో వాహనాలు కదలకున్నా, తెరవెనుక మాత్రం డీజిల్ బిల్లులు చకచకా తయారైపోయినట్లు సమాచారం. బండ్లు నడవకపోయినా.. నడిచినట్లు చూపిస్తూ, దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసేందుకు ముఠా సిద్ధమైంది.

*ఆ రెండు పెట్రోల్ బంకులే టార్గెట్!
ఈ భారీ కుంభకోణంలో ప్రైవేట్ పెట్రోల్ బంకుల పాత్రపై తీవ్ర నిఘా వ్యూహం అమలవుతోంది. ముఖ్యంగా:
 *డెక్కన్ పెట్రోలియమ్స్ 
 *ఎమ్.ఎ. రహ్మాన్ పెట్రోల్ బంక్ 
ఈ రెండు బంకుల యాజమాన్యాలు, జీహెచ్ఎంసీలోని కొంతమంది ఉన్నతాధికారులతో చేతులు కలిపి నకిలీ ఇన్వాయిసులు, తప్పుడు లావాదేవీలతో కోట్ల రూపాయల నిధులను లూటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడేళ్లుగా.. అంటే ఏడాదికి 365 రోజులూ విరామం లేకుండా డీజిల్ సరఫరా చేసినట్లు చూపించి, నిధులు డ్రా చేసుకున్నట్లు గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగితాల్లో ట్రిప్పులు వేసి, ఖజానాను ఖాళీ చేసిన ఈ పెట్రోల్ బంకుల లైసెన్సులను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ ఊపందుకుంది.

*కావడిగూడ టు జైల్ గార్డెన్.. అంతటా అవినీతి నెట్‌వర్క్!

ఇటీవలే కావడిగూడ వర్క్‌షాప్‌లో డీజిల్, విడిభాగాల (స్పేర్ పార్ట్స్) పేరిట జరిగిన దోపిడీపై కథనాలు రాగా, ఇప్పుడు జైల్ గార్డెన్ వ్యవహారం జీహెచ్ఎంసీ పరువును బజారున పడేసింది. ఈ రెండు వర్క్‌షాపుల వెనుక ఒకే అవినీతి నెట్‌వర్క్ పనిచేస్తోందని, ఉన్నతాధికారుల అండదండలు లేనిదే ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ సాధ్యం కాదని కార్పొరేషన్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.WhatsApp Image 2026-06-30 at 21.20.04

*సమగ్ర ఆడిట్ జరగాల్సిందే: విజిలెన్స్ యాక్షన్ ప్లాన్
ప్రజల పన్నుల సొమ్మును కొల్లగొడుతున్న ఈ ముఠా ఆట కట్టించేందుకు కింది చర్యలు తక్షణమే చేపట్టాలని విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి:

 1.లాగ్‌బుక్, జీపీఎస్ క్రాస్ వెరిఫికేషన్: వాహనాలు తిరిగినట్లు జీపీఎస్ (GPS) రికార్డుల్లో ఉందా? లేదా? అనే అంశాన్ని, డీజిల్ ఇష్యూ రిజిస్టర్లతో పోల్చి చూడాలి.
 2. స్పెషల్ ఆడిట్: గత మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రతి బిల్లును, ప్రతి ట్రిప్ వివరాలను నిష్పాక్షికంగా ఆడిట్ చేయాలి.
 3. ఖాతాల సీజ్: అవినీతికి పాల్పడిన ప్రైవేట్ పెట్రోల్ బంకుల బ్యాంకు ఖాతాలను, జీహెచ్ఎంసీ రికార్డులను తక్షణమే సీజ్ చేయాలి.

*ప్రభుత్వ బంకుల ద్వారానే సరఫరా చేయాలి!

ప్రైవేట్ బంకుల యజమానుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే, ఇకపై జీహెచ్ఎంసీ వాహనాలకు ప్రైవేట్ బంకుల నుండి కాకుండా, ప్రభుత్వ రంగ చమురు సంస్థల అధీకృత ఇంధన కేంద్రాల (Government Fuel Outlets) ద్వారా మాత్రమే డీజిల్ సరఫరా చేయాలనే డిమాండ్ వస్తోంది. అలాగే జీపీఎస్ ఆధారిత ఫ్యూయల్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెడితేనే ఈ లూటీకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరి ఈ మెగా డీజిల్ స్కామ్‌పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో? అవినీతి బంకుల యజమానులను, సూత్రధారులైన అధికారులను జైలుకు పంపుతారో లేదో చూడాలి!WhatsApp Image 2026-06-30 at 21.18.57 (2)WhatsApp Image 2026-06-30 at 21.18.58WhatsApp Image 2026-06-30 at 21.18.57 (1)WhatsApp Image 2026-06-30 at 21.18.57WhatsApp Image 2026-06-30 at 21.18.56

About The Author