విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.

పోరుమామిళ్ళ :
పొలంలో కి వస్తున్న అడవి జంతు వుల భారీ నుండి పంటలు కాపాడుకునే ప్రయత్నం లో వేసిన విద్యుత్ తీగలు తగిలి వరికుంట్ల జయన్న అనే వ్యక్తి మృతిచెందారు. కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన వరికుంట్ల జయన్న అనే వ్యక్తి తన పొలంలో అడవి జంతు వుల నుండి పంటలు కాపాడుకునేందుకు బీడు భూమిలో గుంతలు తీసి కట్టలు ఏర్పాటు చేసి,విద్యుత్ తీగ లు తగిలించే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయాన్ని గమనించిన స్థానికులు తెలుసుకున్న
బంధువులకు సమాచారం అందించారు. ఈవిషయమై కాశినాయన పోలీసులకు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పరిశీలించారు. విచారణ చేస్తున్నారు.
About The Author
04 Feb 2026
