రేపు జూన్ 21 న అంతర్జాతీయ యోగా మహోత్సవం

- హాజరు కానున్న ఎమ్మెల్యే, అధికారులు

రేపు  జూన్ 21 న అంతర్జాతీయ యోగా మహోత్సవం

తాండూరు :

 అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ నెల 21న పురస్కరించుకొని యోగా చేద్దాం అందరం ఆరోగ్యంగా ఉందాంఅనే నినాదంతో  పతంజలి యోగ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగ అభ్యసన కార్యక్రమాలు మరియు యోగ పై అవగాహన చేపట్టనున్నట్లు అధ్యక్ష,కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, లక్ష్మన్ తెలిపారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్ హైస్కూల్ మైదానంలో ఆదివారం ఉదయం 6గంటలకు యోగ దినోత్సవ అభ్యసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి,  తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఆర్డీఓ అనిత, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. అదే విధంగా యోగ అభ్యసన కార్యక్రమాల అనంతరం  రక్త ధాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయగలరని పతంజలి యోగ సమితి తరపున కోరుతున్నాం.

About The Author