ఎల్బీనగర్ జోన్ లో అవినీతి తిమింగలాల ‘అఫిడవిట్’ మాయాజాలం:

  • సరూర్నగర్‌లో రూల్స్ అవుట్.. ముడుపులే ఇన్!
  • సరూర్నగర్ మున్సిపల్ ఆఫీస్ గేటు ముందరే భారీ అక్రమ నిర్మాణం. 
  • *నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణానికి ‘అఫిడవిట్’ సర్టిఫికేట్.. అధికార దుర్వినియోగంలో టౌన్ ప్లానింగ్ రికార్డ్!
  • *అనుమతి లేని ప్రమాదకర సెల్లార్, కమర్షియల్ దందాపై ఎం ఎం.ఎం.సి విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండ్!
  • *పక్కా ఆధారాలున్నా నోటీసులకే పరిమితమైన సాయి అర్చన.. కొత్త ఏసీపీ అంబికా శ్రీ యాక్షన్ తీసుకునేనా..?
  • అక్రమ నిర్మాణాలకు అక్రమ పద్ధతిలో టాక్స్ లు వేసి సక్రమ నిర్మాణాలు చేయడంలో సరూర్నగర్ టాక్స్ అధికారులు సిద్ధహస్తులు..
  • మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చర్యలు ఎక్కడ.!

ఎల్బీనగర్ జోన్ లో అవినీతి తిమింగలాల ‘అఫిడవిట్’ మాయాజాలం:

సరూర్నగర్:

అక్రమ నిర్మాణాలకు అక్రమ పద్ధతిలో టాక్స్ లు వేసి సక్రమ నిర్మాణాలు చేయడంలో సరూర్నగర్ టాక్స్ అధికారులు సిద్ధహస్తులు..  టాక్స్ అధికారులు ఇన్చార్జ్ ఎ.ఎంసి బాబురావు, ఏ.ఎం.సీ శ్రీనివాస్, పూర్తి ఆధారాలు పెట్టి వార్తలు రాసినా చర్యలు తీసుకోవడంలో ఉన్నత అధికారులు విఫలమయ్యారు.. ఈ విషయంపై నిఘా విభాగాలు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


అధికారుల అండదండలు, భారీ ముడుపుల పంపకాలు ఉంటే చాలు.. ఎంతటి ఘోర అక్రమ నిర్మాణాన్ని అయినా రాత్రికి రాత్రే 'సక్రమం' చేయవచ్చని నిరూపిస్తున్నారు సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు. సరూర్నగర్ సర్కిల్-12 ఆఫీస్ గేటుకు, అటు ఎమ్మార్వో ఆఫీస్ గేటుకు సరిగ్గా ముక్కు ముందే మున్సిపల్, ఫైర్ సేఫ్టీ నిబంధనలను నడిరోడ్డుపై నిలువునా పాతర వేస్తూ ఈ దందా సాగుతోంది.
తాజాగా ఈ వ్యవహారంలో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. సదరు అక్రమ నిర్మాణ దారుడితో కుమ్మక్కైన కొందరు అవినీతి అధికారులు, తమ అధికార దుర్వినియోగానికి తెరలేపి, భారీగా ముడుపులు అందుకొని వెనుకదారిలో ఒక అఫిడవిట్ రాయించుకుని ఈ ఘోర అక్రమాన్ని చట్టబద్ధం చేసేందుకు బరితెగించినట్లు విశ్వసనీయ సమాచారం!

*నివాస భవనం పేరుతో కమర్షియల్ దందా.. పక్కా ఆధారాలు ఇవే:
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం. ఎం.సి), ఎల్‌బీనగర్ జోన్, సరూర్నగర్ సర్కిల్-12 పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు ‘భారత శక్తి’ చేతికి చిక్కాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
 *నిర్మాణ స్థలం: ప్లాట్ నెం. 11 (తూర్పు భాగం), ప్లాట్ నెం. 5 (పడమర భాగం), శ్రీ వెంకటేశ్వర కాలనీ, సరూర్నగర్ గ్రామం.
 *సర్వే నెంబర్లు: 9, 9/2, 9/3,
 *అనుమతి సంఖ్య (Permit No):0129/GHMC/SWBP/LBNZ/2025
 *అనుమతి తేదీ: 23.09.2024
 *అనుమతించిన ప్లాన్:1 స్టిల్ట్ + 4 అంతస్తులు (1 Stilt + 4 Upper Floors) - కేవలం నివాస భవనం (Residential) కోసం మాత్రమే.

*క్షేత్రస్థాయిలో ఉల్లంఘనల పర్వం:
పై ఫైల్ నెంబర్ ఆధారంగా కేవలం నివాస భవనం కోసం పర్మిషన్ పొందిన సదరు యజమాని జి. సాయిబాబు, క్షేత్రస్థాయిలో దాన్ని ఏకంగా భారీ ‘కమర్షియల్ కాంప్లెక్స్’ గా మారుస్తూ పనులు చేపట్టారు. అంతేకాదు, ప్లాన్‌లో అసలు అనుమతే లేకపోయినా.. చుట్టుపక్కల భవనాలకు ముప్పు వాటిల్లేలా అత్యంత ప్రమాదకర రీతిలో లోతైన అక్రమ ‘సెల్లార్’ తవ్వేశారు. బిల్డింగ్ చుట్టూ వదలాల్సిన కనీస స్థలాన్ని (సెట్ బ్యాక్స్) కూడా వదలకుండా నిబంధనలను గాలికొదిలేశారు.WhatsApp Image 2026-06-21 at 20.16.55

*నోటీసుల డ్రామా.. ‘అఫిడవిట్’ వెనుక అసలు దగా!
ఈ ఘోర ఉల్లంఘనలపై డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి సదరు భవన యజమానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. గత 8 నెలలుగా ఇక్కడ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. అయితే, సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ టి.పి.ఎస్ సాయి అర్చన కేవలం నోటీసులు ఇచ్చి కాలయాపన చేయడమే తప్ప, నిర్మాణాన్ని సీజ్ చేయడానికి వెనకడుగు వేయడం వెనుక అసలు రహస్యం ముడుపుల పంపకమేనని కాలనీవాసులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

స్థానికుల ఆగ్రహం:*
 "అక్రమ నిర్మాణదారుడి నుండి భారీగా చేతులు మారిన ముడుపుల మత్తులోనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కళ్లు మూసుకున్నారు. చట్టపరంగా సీజ్ చేయాల్సిన బిల్డింగ్‌ను, ఒక దొంగ అఫిడవిట్ రాయించుకుని రూల్స్ ముసుగులో కాపాడాలని చూడటం అధికారుల అవినీతికి పరాకాష్ట."

*మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగాల్సిందే!
కళ్లెదుటే ఇంత పెద్ద అక్రమ కమర్షియల్ భవనం వెలుస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సరూర్నగర్ ఇంచార్జ్ ఏసీపీ (Town Planning) ಅಂಬಿಕಾ శ్రీ గారు తక్షణమే ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అఫిడవిట్ల పేరుతో అక్రమాలను సక్రమం చేస్తున్న అవినీతి అధికారుల భరతం పట్టేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) విజిలెన్స్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి పూర్తిస్థాయి విచారణ (Enquiry) జరపాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సదరు అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేయడంతో పాటు, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘భారత శక్తి’ డిమాండ్ చేస్తోంది.WhatsApp Image 2026-06-21 at 20.16.55 (1)

About The Author