రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎల్బీనగర్:
రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి శ్రీమతి దుర్గ యోగా యొక్క ప్రాముఖ్యత, శారీరక, మానసిక ఆరోగ్యంపై యోగా కలిగించే సానుకూల ప్రభావాలను న్యాయమూర్తులు, న్యాయవాదులకు వివరించారు. అనంతరం యోగా ఆసనాలు, ప్రాణాయామం నిర్వహించి వాటి ప్రయోజనాలను వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వినోద్ కుమార్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి శ్రీవాణి, పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్, న్యాయ సేవ సంస్థ కార్యదర్శి అనూష, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి హనుమంతరావు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి విప్లవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వొద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షులు బొడ్డు రమేష్ కుమార్, సహాయ కార్యదర్శి మల్లేశం పులిమామిడి, లైబ్రరీ కార్యదర్శి పిఆర్వి ప్రసాద్, క్రీడా కార్యదర్శి భీమ్ రావు, కోశాధికారి మాధవి,సాంస్కృతిక కార్యదర్శి పి సుధ, కార్యవర్గ సభ్యులు నగేష్ , సత్యనారాయణ,నరేష్, విజయ్ కుమార్, స్రవంతి, శ్రీలత, శ్రీవాణితో పాటు పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు వేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.
