తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ల నిలిపివేత

ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలిక విరామం; 29 నుంచి సేవలు పునఃప్రారంభం

తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ల నిలిపివేత

హైదరాబాద్:
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలిక విరామం కలగనుంది. షెడ్యూల్డ్ సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

*ఐదేళ్ల తర్వాత ఆధునీకరణ
దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నారు. సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడానికి, భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడానికి, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఈ తాత్కాలిక విరామం అవసరమని అధికారులు పేర్కొన్నారు.

*ప్రజలకు కనీస అసౌకర్యం
ఈ షెడ్యూల్‌ను ప్రజలకు కనీస అసౌకర్యం కలిగేలా రూపొందించారు.
 *జూన్ 26: మొహరమ్ ప్రభుత్వ సెలవు దినం
 *జూన్ 27: ప్రభుత్వ పని దినం (ఈ ఒక్కరోజు మాత్రమే సేవలకు అంతరాయం)
 *జూన్ 28:ఆదివారం సాధారణ సెలవు దినం
మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే పని దినం కావడంతో సాధారణ ప్రజలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ముందస్తు ప్రణాళిక అవసరం
జూన్ 29వ తేదీ నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయి. కాబట్టి ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, శాఖ నిర్వహణ పనులకు సహకరించాలని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు.WhatsApp Image 2026-06-18 at 21.19.24

About The Author