రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి సురక్ష సేవా సంఘం చక్రాల కుర్చీ వితరణ

  • బాధితునికి వీల్ చైర్ ఏర్పాటు చేసిన సురక్ష సేవా సంఘం
  • పేదలకు సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది..
  • సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్.

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి సురక్ష సేవా సంఘం చక్రాల కుర్చీ వితరణ

ఎల్బీనగర్

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం గండి చెరువు గ్రామంలో పేద కుటుంబానికి చెందిన మహమ్మద్ అఫ్సర్ (62) ఒక రోడ్డు ప్రమాదం లో కాలుకి గాయం అయ్యి చివరికి తన కుడి కాలును తొలగించాల్సి వచ్చింది. ఒంటి కాలితో చాలా ఇబ్బంది పడుతూ తన కాల కృత్యాలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న అతని దయనీయ దుస్థితి సురక్ష సేవా సంఘం సభ్యులు, గడ్డిఅన్నారం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర చారి సురక్ష సేవా సంఘం దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన సురక్ష అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ తన సొంత ఖర్చుతో బాధితునికి సెల్ఫ్ కంట్రోల్డ్ చక్రాల కుర్చీ ఏర్పాటు చేసి ఆయనకు అందించారు. ఈ సందర్భంగా గోపి శంకర్ మాట్లాడుతూ, 12 సంవత్సరాలుగా పేద ప్రజల ఔన్నత్యం కొరకు సురక్ష పాటు పడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, ఉప సర్పంచ్ పానుగంటి రాధిక బాలరాజు గౌడ్ వార్డ్ మెంబర్స్ జక్క ధర్మారెడ్డి, గుర్రం రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్స్ పూజారి శేఖర్ గౌడ్, బండారి శ్రీశైలం,బరిగల లలిత కిషన్, బండారి అనిల్, శివ చారి, సురక్ష సేవా సంఘం సభ్యులు అచ్చిని మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author