గుమ్మడిదలలో మూడు కోట్ల 13 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల:
గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో మూడు కోట్ల 13 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం మున్సిపల్ పాలకవర్గం తో కలిసి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ..అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా పనిచేసినప్పుడే వారి మన్ననలు పొందుతామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు..స్థానిక పరిశ్రమల ద్వారా సి ఎస్ ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అనంతరం గుమ్మదలలో నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..jpeg)
