సమాజం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి

  • పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 
  • జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

సమాజం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి

జిన్నారం :

ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 

బుధవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముకలని, కళాశాల స్థాయి నుంచే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు  విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలను అలవర్చుకొని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.  ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల కోరిక మేరకు అతి త్వరలో బెంచీలు అందచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ కళింగ కృష్ణ కుమార్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-17 at 19.51.40 (1)

About The Author