తెలంగాణలో బీజేపీని పటిష్టం చేస్తాం: మునావత్ పాండు నాయక్

కాంగ్రెస్ ప్రభుత్వంపై గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి ధ్వజం

తెలంగాణలో బీజేపీని పటిష్టం చేస్తాం: మునావత్ పాండు నాయక్

హైదరాబాద్: 

తెలంగాణవ్యాప్తంగా గిరిజనుల సంక్షేమానికి శ్రమిస్తూ, రాష్ట్రావతారంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునావత్ పాండు నాయక్ తెలిపాడు. గిరిజనుల హక్కుల రక్షణకు నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
ఇటీవల గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడైన పాండు నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న గిరిజన తండాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులందరికీ చేరవేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని వివరించాడు.

*కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని, బీజేపీ అధికారంలోకి రావడం నూటికి నూరు శాతం నిజమని పాండు నాయక్ ధీమా వ్యక్తం చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను ఏమాత్రం నెరవేర్చలేదని విమర్శించాడు. రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించాడు.

*తండాలలో మౌలిక వసతులు కల్పించాలి
రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలలో రోడ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునావత్ పాండు నాయక్ డిమాండ్ చేశాడు.

About The Author