హలో కార్మిక. చలో మహబూబ్ నగర్
తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయండి
వికారాబాద్:
తెలంగాణ వ్యవసాయ కార్మిక
సంఘం జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం శుక్రవారం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో యాలాల మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో, కార్మికుల తో కలిసి మహాసభల కరపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20,21,22 మహబూబ్ నగర్ పట్టణం లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలకు జిల్లా లోని వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు . మహాసభలలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలు, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు, కూలీల భద్రతకు చేయాల్సిన భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటామన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ , వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి విజయ్ రాఘవాన్ , బి. వెంకట్ , రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాల్లో ఉన్న అంగన్ వాడి టీచర్స్ హెల్పర్స్ ఆశ వర్కర్స్ గ్రామపంచాయతీ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ హమాలి కార్మికులు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జి. రత్నం, డి.రాజ్ కుమార్, ఆరిఫ్, శివ,చంద్రప్ప, నర్సిములు, షేబ్బీర్, నారాయణ, సరస్వతి, శ్యామమ్మ,తదితరులు ఉన్నారు.
