తాండూరు మున్సిపల్‌లో డీఈ పోస్టు ఖాళీ.. అభివృద్ధి పనులకు బ్రేక్ : బీఆర్ఎస్ నేత సంతోష్ గౌడ్

  • తాండూరు జూన్ 18 భారత శక్తి 
  • 15 రోజులుగా డీఈ లేక ఇంజనీరింగ్ శాఖ పనులు స్తంభించాయి 
  • వెంటనే డీఈ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

తాండూరు మున్సిపల్‌లో డీఈ పోస్టు ఖాళీ.. అభివృద్ధి పనులకు బ్రేక్ : బీఆర్ఎస్ నేత సంతోష్ గౌడ్

తాండూరు మున్సిపాలిటీలో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) లేకపోవడంతో పట్టణ అభివృద్ధి పనులు సాగడం లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సంతోష్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ, ..
.ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా మున్సిపల్ డీఈకి స్థానచలనం కల్పించడంతో.
గత 15 రోజులుగా డీఈ పోస్టు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారం ఆలస్యం అవుతోందని అన్నారు. ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు కూడా సక్రమంగా కొనసాగడం లేదని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల కారణంగా పట్టణాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందాల్సిన పలు సేవలు ప్రభావితమవుతున్నాయని . తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తాండూరు మున్సిపాలిటీలో డీఈ అధికారిని నియమించి, అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సంతోష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
"అధికారి కొరతతో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు.

About The Author