తాండూరులో ఘనంగా వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారమహోత్సవం
- వీరశైవ సమాజ అభివృద్ధికి అండగా ఉంటాం :
- చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
- బసవేశ్వరుని ఆశయాలతో సమ సమాజ నిర్మాణమే లక్ష్యం :
- ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- సమాచాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- నూతన అధ్యక్షుడిగా తంబాకు చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ
తాండూరు:
తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మండపంలో ఆదివారం వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సమాజ ఎన్నికల అధికారి బిర్కడ్ నారాయణ నూతనంగా ఎంపికైన అధ్యక్షుడిగా తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శి వాలి శ్రవణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఆడ్కి శశాంక్, కోశాధికారి కందనెల్లి ప్రకాశం వారి కార్యవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారాన్ని చేయించారు అనంతరం ముఖ్య అతిథులు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో వీరశైవ సమాజ అభివృద్ధికి తనవంతు సహకారం అందించానని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సమాజ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ జగజ్యోతి బసవేశ్వరుని స్ఫూర్తితో సమ సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న వీరశైవ సమాజానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సమాజ అభ్యున్నతి కోసం అవసరమైన సహకారం అందించేందుకు కట్టుబడి ఉంటామని అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ,
తాండూర్ లోని అతిపెద్ద సమాజం వీర శైవ సమాజం కు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అభివృద్ధికి తోడ్పాటుకు సహకరిస్తామని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు.
అనంతరం నూతన అధ్యక్షుడిగా తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శిగా వాలి శ్రవణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఆడ్కి శశాంక్, కోశాధికారి కందనెల్లి ప్రకాశంతో పాటు గౌరవ అధ్యక్షులు గులి పరమేశ్వర్, ఉపాధ్యక్షులు శెట్టి భాస్కర్ తో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభిమానులు సంఘ సభ్యులు తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, వీరశైవ సమాజం సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
