వెంకటేశ్వర కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఎల్బీనగర్:
సరూర్ నగర్ డివిజన్ లోని అతి పెద్ద కాలనీ అయినటువంటి శ్రీవెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ (2026 నుండి 2028) నూతన కమిటీ ప్రమాణ స్వీకర మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అధ్యక్షునిగా గండు ధనంరెడ్డి, గౌరవ ఆధ్యక్షునిగా బోయిన మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షునిగా మునగాల సరేష్, ప్రధాన కార్యదర్శిగా పివిఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రెటరీలుగా వడ్డీ సుబ్రమణ్యం, సప్పిడి గోవర్ధన్ రెడ్డి కోశాధికారిగా సోమ వెంకటేశ్వర్లు, సలహాదారునిగా తులసీ క్రిష్ణమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా టి.శ్రీనివాసరావు, ఎక్సిక్యూటీవ్ కమిటీ మెంబర్లుగా టి.శ్రీనివాస్ కార్తీక్, ఎన్.గణేష్ యాదవ్, జి.ప్రవీణ్ కుమార్, ఎం. సుధాకర్, కె.రవి గౌడ్, టి.నాగ ఆజయ్ గోపి, సోమ ప్రవీణ్ కుమార్, కె. నవీనచంద్ర. ఎన్. ఎస్.ఐ.రవి , సిహెచ్, సురందర్ రావు , చెన్న అనిల్, వి.ఎ. వంశీమోహన్, కె.వి.శ్రీనివాస్, ఎం.లింగరావులు ప్రమాణస్వీకారం చేశారు. ఎలక్షన్ అధికారీ ఎం. శాంతి ప్రసాద్ గెలుపొందిన నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ పెద్దలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మారోజు శ్రీనివాస్ రావు. కనకారావు, సాయి కిరణ్, రవికుమార్, మురళికొండిన్య, భోగేశ్వర్రావు. మాధవరావులతో పాటు కాలనీ వాసులు కమిటీ కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
