తెలంగాణలో క్రీడా విప్లవం: రూ.50.73 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం.

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. జిల్లాల్లో మినీ స్టేడియాలు, గచ్చిబౌలిలో అంతర్జాతీయ స్థాయి అకాడమీలు సిద్ధం!

తెలంగాణలో క్రీడా విప్లవం: రూ.50.73 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం.

హైదరాబాద్:*
తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా రూ.50.73 కోట్ల అంచనా వ్యయంతో పలు క్రీడా ప్రాజెక్టులకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లాల్లో క్రీడా మైదానాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడంతో పాటు, హైదరాబాద్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణ అకాడమీలను వారు ప్రారంభించారు.

*రూ.36.65 కోట్లతో జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు క్రీడా వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు రూ.36.65 కోట్ల వ్యయంతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
*శంకుస్థాపనల పూర్తి వివరాలు:
 *షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): కొందుర్గ్ మండల కేంద్రంలో రూ.10 కోట్ల వ్యయంతో మినీ స్టేడియం నిర్మాణం.
 *సంగారెడ్డి: రూ.10 కోట్లతో జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ పనులు.
 *నారాయణపేట: నర్వ మండల కేంద్రంలో రూ.4 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.
 *వనపర్తి (ఆత్మకూర్): రూ.4 కోట్లతో బహుళ ప్రయోజన (మల్టీ పర్పస్) స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి.

 *కామారెడ్డి: గాంధారి మండల కేంద్రంలో రూ.3.50 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.
 *మెదక్: నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం.

 *నారాయణపేట (మక్తల్):ఉట్కూరులో రూ.2.50 కోట్లతో వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణం.

WhatsApp Image 2026-06-19 at 20.12.45
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలలో బాలబాలికలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు రూ.14.08 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పలు అకాడమీలను ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రారంభించారు. ముఖ్యంగా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA), అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన టాలెంట్ అకాడమీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

*ప్రారంభమైన అకాడమీల వివరాలు:
 *ఫిఫా - ఏఐఎఫ్ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ (గచ్చిబౌలి): బాలికల అకాడమీకి రూ.5.70 కోట్లు, బాలుర అకాడమీకి రూ.5.70 కోట్లు.

 *హాకీ అకాడమీ (గచ్చిబౌలి): బాలికల విభాగానికి రూ.44.50 లక్షలు, బాలుర విభాగానికి రూ.44.50 లక్షలు.
 *అథ్లెటిక్స్ అకాడమీ (గచ్చిబౌలి): బాలికల విభాగానికి రూ.35.95 లక్షలు, బాలుర విభాగానికి రూ.35.94 లక్షలు.
 *ఫుట్‌బాల్ అకాడమీ (ఎల్బీ స్టేడియం): బాలుర శిక్షణ కోసం రూ.58.50 లక్షలు.
 *హ్యాండ్‌బాల్ అకాడమీ (ఎల్బీ స్టేడియం): బాలుర శిక్షణ కోసం రూ.49 లక్షలు.

*భారత శక్తి విశ్లేషణ:
 ఈ సరికొత్త మౌలిక సదుపాయాలు మరియు శిక్షణా కేంద్రాల ఏర్పాటు ద్వారా తెలంగాణ నుండి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యేందుకు బలమైన పునాది పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కోర్టులు, స్టేడియాలు అందుబాటులోకి రావడం క్రీడాకారుల ప్రతిభకు మరింత పదును పెట్టనుంది.WhatsApp Image 2026-06-19 at 20.12.44

About The Author