సమాజ శ్రేయస్సు కోసం జీవించేవారే ధన్యులు: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.

  • ఇంజాపూర్ జెడ్‌పీహెచ్‌ఎస్‌లో సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ
  • *ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భూపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు అభినందనీయం

సమాజ శ్రేయస్సు కోసం జీవించేవారే ధన్యులు: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.

ఇబ్రహీంపట్నం: 
సమాజ శ్రేయస్సు కోసం జీవించేవారే నిజమైన ధన్యజీవులని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇంజాపూర్‌కు చెందిన బొక్క భూపాల్ రెడ్డి తన 83వ జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్‌పీహెచ్‌ఎస్)లో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. భూపాల్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు అందించిన యూనిఫాంలు, పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భూపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్‌రెడ్డి.. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
"తమకున్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు పంచినప్పుడే ఉన్నతమైన సమాజం నిర్మితమవుతుంది. సమాజంలో సేవా దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉంది."
    మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే

  *విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. సరికొత్త విధానాలతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్లు చెప్పారు. భూపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరు వెంకట్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author