శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా వికారి శ్వారి క్రతు జీవహోత్త్సవ ఆహ్వాన కార్యక్రమం..

శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా వికారి శ్వారి క్రతు జీవహోత్త్సవ ఆహ్వాన కార్యక్రమం..

కాప్రా:

మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని మంగపురం లో గోదాదేవి రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వికారి శ్వారి క్రతు జీవహోత్త్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు అతిథులకు సాదర స్వాగతం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

About The Author