ఐదుగురు మంత్రులకు…రాం..రాం

విశాఖపట్టణం, అక్టోబరు 18 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్నాయ్‌.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం జగన్‌ రెడ్డి .. ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కొందరిని పక్కనపెట్టే యోచనలో ఉన్నారంట.. ప్రస్తుతం తన కేబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రులకు టికెట్లు ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి లేదట… వీరిలో కొందరు తమకు టికెట్లు వద్దని చెప్పగా.. మరికొందరు ఎంపీలుగా పోటీచేయడానికి రెడీ అవుతున్నారంటున్నారు … ఇంతకీ ఆ మంత్రులు ఎవరు..? ఏయే జిల్లాలకు చెందిన వారు..? అధికార పార్టీ ఎందుకీ నిర్ణయం తీసుకుంది..? ‘వై నాట్‌ 175’.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తోంది … క్షేత్రస్థాయిలో వైసీపీకి సానుకూల సంకేతాలు చాలా బాగున్నాయి.. అందరూ నావాళ్లే.. ఒకవేళ ఈసారి టికెట్‌ రాకపోయినా వేరే పదవులు ఇస్తాను.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. ఇవీ వైసీపీ అధినేత జగన్‌ పదే పదే చేస్తున్న ప్రకటనలు …. ఇటీవల కేబినెట్‌ భేటీలోనూ ఇవే మాటలు జగన్‌ నోటి నుంచి వచ్చాయి … ఇప్పటికే కేబినెట్‌ భేటీలో కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేనని తేల్చిచెప్పేసిన జగన్‌.. తాజాగా మరో ఐదుగురు మంత్రులకు హ్యాండివ్వబోతున్నారని టాక్‌ నడుస్తోంది …ఆ ఐదుగురిలో ఇద్దరు సీనియర్‌ మంత్రులంట.. ఆ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన వారేనట … మరో ముగ్గురు జూనియర్‌ మంత్రులు ఉన్నారట. అయితే ఈ ఐదుగురిలో ఒకరిద్దరు తమకు ఈసారి టికెట్లు అక్కర్లేదని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరగా.. మరికొందరేమో తాము పెద్దల సభ రాజ్యసభకు వెళ్తామని జగన్‌ ముందు తమ మనసులో మాటను బయటపెట్టారట.స్పాట్‌విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీనియర్‌ మంత్రులు ధర్మాన ప్రసాద్‌, బొత్స సత్యనారాయణ ఇద్దరూ తమకు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేస్తే ఆసక్తి లేదని చెప్పినట్లు తెలియవచ్చింది … తన కుమారుడికి ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. తనను రాజ్యసభకు పంపాలని జగన్‌ను కోరారట ధర్మాన … ఇక బొత్స కూడా తన సతీమణి బొత్స రaాన్సికి ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని జగన్‌ కోరగా.. ఇంతవరకూ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రియాక్షన్‌ రాలేదట. ఇక మిగిలిన ముగ్గురు జూనియర్‌ మంత్రుల్లో ఇద్దరు కోస్తా జిల్లాలకు చెందిన మహిళా మంత్రులు ఉన్నట్లు సమాచారం … ఇంకొకరు రాయలసీమకు చెందిన రెండోసారి మంత్రి పదవి పొందిన ఒకరు ఉన్నారని తెలిసింది … అలాగే మరో ఇద్దరికి టికెట్లు ఇవ్వలేనని జగన్‌ తేల్చిచెప్పేశారట… టికెట్లు ఇవ్వని నేతలకు మాత్రం ప్రాధాన్యతతో కూడిన పదవులు ఇస్తానని జగన్‌ మాటిచ్చారట… ఒకరిద్దరు ఎంపీలు సైతం ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు సీనియర్‌ మంత్రులకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక ఎమ్మెల్యేలు అయిన తమ పరిస్థితి ఏంటని వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. వైసీపీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించేసరికి ఇంకా జగన్‌ ఎన్నెన్ని పాలిట్రిక్స్‌ ప్లే చేస్తారో చూడాలి మరి.

ఐదుగురు మంత్రులకు…రాం..రాం

విశాఖపట్టణం, అక్టోబరు 18
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్నాయ్‌.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం జగన్‌ రెడ్డి .. ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కొందరిని పక్కనపెట్టే యోచనలో ఉన్నారంట.. ప్రస్తుతం తన కేబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రులకు టికెట్లు ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి లేదట… వీరిలో కొందరు తమకు టికెట్లు వద్దని చెప్పగా.. మరికొందరు ఎంపీలుగా పోటీచేయడానికి రెడీ అవుతున్నారంటున్నారు … ఇంతకీ ఆ మంత్రులు ఎవరు..? ఏయే జిల్లాలకు చెందిన వారు..? అధికార పార్టీ ఎందుకీ నిర్ణయం తీసుకుంది..? ‘వై నాట్‌ 175’.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తోంది … క్షేత్రస్థాయిలో వైసీపీకి సానుకూల సంకేతాలు చాలా బాగున్నాయి.. అందరూ నావాళ్లే.. ఒకవేళ ఈసారి టికెట్‌ రాకపోయినా వేరే పదవులు ఇస్తాను.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. ఇవీ వైసీపీ అధినేత జగన్‌ పదే పదే చేస్తున్న ప్రకటనలు …. ఇటీవల కేబినెట్‌ భేటీలోనూ ఇవే మాటలు జగన్‌ నోటి నుంచి వచ్చాయి … ఇప్పటికే కేబినెట్‌ భేటీలో కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేనని తేల్చిచెప్పేసిన జగన్‌.. తాజాగా మరో ఐదుగురు మంత్రులకు హ్యాండివ్వబోతున్నారని టాక్‌ నడుస్తోంది …ఆ ఐదుగురిలో ఇద్దరు సీనియర్‌ మంత్రులంట.. ఆ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన వారేనట … మరో ముగ్గురు జూనియర్‌ మంత్రులు ఉన్నారట. అయితే ఈ ఐదుగురిలో ఒకరిద్దరు తమకు ఈసారి టికెట్లు అక్కర్లేదని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరగా.. మరికొందరేమో తాము పెద్దల సభ రాజ్యసభకు వెళ్తామని జగన్‌ ముందు తమ మనసులో మాటను బయటపెట్టారట.స్పాట్‌విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీనియర్‌ మంత్రులు ధర్మాన ప్రసాద్‌, బొత్స సత్యనారాయణ ఇద్దరూ తమకు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేస్తే ఆసక్తి లేదని చెప్పినట్లు తెలియవచ్చింది … తన కుమారుడికి ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. తనను రాజ్యసభకు పంపాలని జగన్‌ను కోరారట ధర్మాన … ఇక బొత్స కూడా తన సతీమణి బొత్స రaాన్సికి ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని జగన్‌ కోరగా.. ఇంతవరకూ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రియాక్షన్‌ రాలేదట. ఇక మిగిలిన ముగ్గురు జూనియర్‌ మంత్రుల్లో ఇద్దరు కోస్తా జిల్లాలకు చెందిన మహిళా మంత్రులు ఉన్నట్లు సమాచారం … ఇంకొకరు రాయలసీమకు చెందిన రెండోసారి మంత్రి పదవి పొందిన ఒకరు ఉన్నారని తెలిసింది … అలాగే మరో ఇద్దరికి టికెట్లు ఇవ్వలేనని జగన్‌ తేల్చిచెప్పేశారట… టికెట్లు ఇవ్వని నేతలకు మాత్రం ప్రాధాన్యతతో కూడిన పదవులు ఇస్తానని జగన్‌ మాటిచ్చారట… ఒకరిద్దరు ఎంపీలు సైతం ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు సీనియర్‌ మంత్రులకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక ఎమ్మెల్యేలు అయిన తమ పరిస్థితి ఏంటని వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. వైసీపీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించేసరికి ఇంకా జగన్‌ ఎన్నెన్ని పాలిట్రిక్స్‌ ప్లే చేస్తారో చూడాలి మరి.

About The Author

Related Posts