ఆర్టీసీ కార్మికులకు అండగా కత్తి కార్తిక గౌడ్.. రేవంత్ సర్కార్‌పై ఫైర్

ఆర్టీసీ కార్మికులకు అండగా కత్తి కార్తిక గౌడ్.. రేవంత్ సర్కార్‌పై ఫైర్

సిద్దిపేట:

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. విలీనం హామీ నెరవేరక, జీతాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదంతో అది చట్టంగా కూడా మారింది. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, ఆ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కార్తిక గౌడ్ మండిపడ్డారు.ఈ ఆలస్యం కారణంగా ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని ఘటనలు ఆత్మహత్యలకు దారితీయడం అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని, ఇకనైనా మేల్కొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్తిక గౌడ్ డిమాండ్ చేశారు.  విలీన ప్రక్రియను వెంటనే పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆమె హెచ్చరించారు.

About The Author