సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆర్. చత్రపతి యాదవ్‌కు సన్మానం
సిద్దిపేట:
ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ కళాశాల, సిద్దిపేటకు ప్రిన్సిపాల్‌గా ఆర్. చత్రపతి యాదవ్ నియమితులైన సందర్భంగా పూర్వ విద్యార్థులు శుక్రవారం ఘనంగా సన్మానించారు.పల్లెటూరి ప్రసాద్, బాయికాడి లక్ష్మణ్ తదితరులు కళాశాల ఆవరణలో ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2012లో సిద్దిపేటలో పీజీ కళాశాల స్థాపనకు చత్రపతి యాదవ్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఆ కృషికి గుర్తింపుగా ఇప్పుడు ప్రిన్సిపాల్ పదవి దక్కడం గర్వకారణమని అన్నారు. జర్నలిజం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించిన ఆయనకు పదోన్నతి రావడం ఆనందదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమేష్ పాల్వాయి, మచ్చ శ్రీహరి, గణేష్, బాబు, శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు..jpeg)
About The Author
25 Apr 2026
