హస్తం అవినీతి.. గులాబీ అహంకారం.. ఇక నడవదిద్దీ ఆట!

బడుగుల గొంతుకగా ‘కవిత’ కొత్త జెండా.. రేపు మేడ్చల్‌లో పొలిటికల్ గర్జన!*

హస్తం అవినీతి.. గులాబీ అహంకారం.. ఇక నడవదిద్దీ ఆట!

హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మస్తు ఇంట్రెస్టింగ్‌గా మారినయ్. ఒక దిక్కు కాంగ్రెస్ సర్కార్ పైసల వేటలో పడి పబ్లిక్‌ను మరిచిపోతే, ఇంకో దిక్కు పదేండ్లు ఏలిన బీఆర్‌ఎస్ పాత అహంకారాన్ని వదలక ఆత్మరక్షణలో పడ్డది. ఈ రెండు పార్టీల తీరుతో విసిగిపోయిన జనానికి.. ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. అణగారిన వర్గాల అండతో, బీసీ నినాదమే ఊపిరిగా *కల్వకుంట్ల కవిత* కొత్త పార్టీ పెడుతోంది. రేపు శనివారం (ఏప్రిల్ 25న) మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఈ కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది.

ఏసీ గదుల పాలనకు చెక్!*
నీళ్లు, నిధులు, నియామకాల కోసమని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నీళ్లు పారడం లేదు కానీ, కాంగ్రెస్ లీడర్ల అవినీతి మాత్రం ఏరులై పారుతోంది. ఇక గులాబీ దళం సంగతి సరేసరి. అధికారంలో ఉన్నప్పుడు ఏసీ గదులు, ఏసీ కార్లు తప్ప సామాన్యుడి కష్టం కనిపియ్యలె. ఓడినాక కూడా అదే తలపొగరుతో, కార్యకర్తలకు దొరకని నేతలతో బీఆర్‌ఎస్ డీలా పడ్డది. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న తెలంగాణకు.. వీధి పోరాటాలే ఊపిరిగా కవిత కొత్త ప్రస్థానం మొదలుపెడుతోంది.

బీసీలదే రాజ్యం.. రామకోటి గళం!*
ఈ కొత్త పార్టీకి బీసీ వర్గాల మద్దతు మస్తుగా దొరుకుతోంది. *తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి* ఈ సందర్భంగా సర్కార్ తీరును ఎండగట్టారు. "మెజారిటీగా ఉన్న బీసీలే పన్నులు కడుతుండ్రు.. కానీ ఆ సంపదంతా కొందరి జేబుల్లోకి పోతోంది. ఆకలి, అజ్ఞానం లేని తెలంగాణ రావాలంటే అది కవిత నాయకత్వంతోనే సాధ్యం" అని ఆయన నొక్కి చెప్పారు. సాకలి ఐలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయిల స్ఫూర్తితో.. మహిళలు, బీసీలు ఏకమై అస్త్రం పడుతున్నారు.

పోరుగడ్డపై కొత్త జెండా ఎజెండా ఇదే!
 * *నిరుద్యోగ గండం:* చదువుకున్నోళ్లకు కొలువులు లేక, స్కాలర్‌షిప్‌లు రాక ఆగమవుతున్న స్టూడెంట్స్ పక్షాన ఈ పార్టీ గొంతు విప్పనుంది.

 ఫీజుల ఫైట్:* ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో సర్కార్ చేస్తున్న నాటకాలను బట్టబయలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది.

 మహిళా శక్తి: కేవలం ఓట్ల కోసం కాకుండా, పాలిటిక్స్‌లో మహిళలకు అసలైన పవర్ ఇచ్చేందుకు కవిత టీమ్ రెడీ అయింది.

జనం నీరాజనం..
తెలంగాణ జాగృతితో ఊరూరా బతుకమ్మను ఆడించిన కవితకు.. ఇప్పుడు రాజకీయంగా కూడా ఊరూరా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అహంకారాన్ని ఇష్టపడని పాత కార్యకర్తలు, కాంగ్రెస్ మోసాలను కనిపెట్టిన జనం.. కవిత పార్టీ వైపు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటామని చెబుతుండటంతో.. ఈ కొత్త పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ మలుపు!*
రేపు మేడ్చల్ వేదికగా జరగబోయే ఆవిర్భావ సభ.. తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుపానును సృష్టించబోతోంది. అల్లంపల్లి రామకోటి వంటి బలమైన సామాజిక నేతలు తోడుండటంతో.. ఈ పార్టీ కేవలం ఒక గ్రూపుగా కాకుండా, ఒక ప్రజా ఉద్యమంగా మారేలా కనిపిస్తోంది. మరి ఈ ‘కొత్త జెండా’ తెలంగాణ గడ్డపై ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి!

About The Author