చెరువుల పునరుద్ధరణతోనే భూగర్భ జలాలు
- ఎస్‌టీపీలు సిద్ధం కావాల్సిందే: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- జూబ్లీహిల్స్‌లో 1600 గజాల పార్కు స్థలం స్వాధీనం
- దుండిగల్‌లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
హైదరాబాద్:
చెరువులను పునరుద్ధరించినప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయని, ఈ పనులు పూర్తయ్యేలోపు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు) కూడా అందుబాటులోకి రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్ చెరువుతో పాటు కొండాపూర్‌లోని కుడికుంట చెరువును సందర్శించారు.
*మురుగు చేరకుండా జాగ్రత్తలు*
రెండో విడతలో భాగంగా చేపట్టిన 14 చెరువుల పునరుద్ధరణలో ఇబ్రహీంబాగ్ చెరువు కీలకమని కమిషనర్ పేర్కొన్నారు. "చెరువుల్లో పూడికను పూర్తిగా తొలగించాలి. అప్పుడే దుర్వాసన పోయి నీరు నిలుస్తుంది. చెరువులు సిద్ధమయ్యాక మళ్లీ మురుగునీరు చేరితే పనులన్నీ వృథా అవుతాయి. అందుకే 56 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎస్‌టీపీ పనులను వేగవంతం చేయాలి" అని జలమండలి అధికారులకు సూచించారు. ఎస్‌టీపీల నుంచి వచ్చే నీటిని నేరుగా చెరువులోకి వదలకుండా మొదట సెడిమెంటేషన్ పాండ్‌లోకి పంపాలని స్పష్టం చేశారు..jpeg)
వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా ఇప్పటికే తొలగించింది. ఆయా ప్రాంతాలను చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా మార్చాలని, చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్కులను ఏర్పాటు చేసి అన్ని వయసుల వారికి ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దాలని రంగనాథ్ అధికారులను కోరారు. అనంతరం కొండాపూర్‌లోని కుడికుంట చెరువును పరిశీలించి, జల సంరక్షణలో 'సాహే', 'ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్' సంస్థల కృషిని అభినందించారు.
*కోట్ల విలువైన స్థలాల రక్షణ*
మరోవైపు నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంది.
* *దుండిగల్:* మేడ్చల్ జిల్లా దొమ్మరపోచంపల్లిలో 120/1, 120/28 సర్వే నంబర్లలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమి పదేపదే ఆక్రమణలకు గురవుతోంది. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు హైడ్రా బృందం గురువారం ఆ భూమికి ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించింది.
