ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
వాసవి మాత జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించడంపై ఆర్యవైశ్యుల హర్షం
గజ్వేల్:
కన్యాకా పరమేశ్వరి వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర అధికారిక వేడుకగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ ఏం సీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ,కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, సిద్ది బిక్షపతి, ఏర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ద్వారా ఆర్యవైశ్యులకు ముఖ్యమంత్రి సముచిత గౌరవం కల్పించారని నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని కులాలకు, వర్గాలకు న్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..jpeg)
