తై బజార్ వేలం పాట వాయిదా
సిద్దిపేట కమిషనర్ అశ్రీత్ కుమార్
సిద్దిపేట:
సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో నిర్వహించాల్సిన తై బజార్ వేలం పాటను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కమిషనర్ అశ్రీత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
చిరు వ్యాపారుల నుంచి వ్యాపార నిర్వహణ రుసుమును సేకరించి, ఆ ప్రాంత నిర్వహణకు వినియోగించేందుకు ఈ వేలం పాటను నిర్వహించాల్సి ఉండగా, ముందుగా నిర్ణయించిన 24-04-2026 తేదీకి బదులుగా ఇప్పుడు 01-05-2026 రోజున మధ్యాహ్నం 4:00 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ వేలం పాటలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు ఈ నెల 30-04-2026లోపు పురపాలక సంఘం పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (DD) చెల్లించి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పురపాలక సంఘం కార్యాలయాన్ని సంప్రదించవచ్చని కమిషనర్ తెలిపారు.
About The Author
27 Apr 2026
